ట్యాగ్ · 2 కథనాలు

'నిన్నుకోరి' రీమేక్ కు సూపర్ క్రేజ్..!
మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న "నిన్నుకోరి "
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ , కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్స్ పై శివ నిర్వాణ దర్శకత్వంలో నాని , నివేత థామస్ , ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలలో రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ "నిన్నుకోరి" మూవీ 2017 సంవత్సరం జులై 7 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో శివ నిర్వాణ టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. గోపిసుందర్ స్వరపరచిన సాంగ్స్ ప్రేక్షకులకు వీనుల విందు చేశాయి. ఈ రోజు తో "నిన్నుకోరి" మూవీ మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది.

'నిన్నుకోరి' రీమేక్ కు సూపర్ క్రేజ్..!
అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. ఒకప్పుడు మనం పక్క సినిమాలను తెచ్చుకొని ఇక్కడ రీమేక్ చేసుకునేవాళ్లం.. కానీ ఇప్పుడు మన సినిమాలకు క్రేజ్ పెరిగింది. మన సినిమాలను రీమేక్ చేయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాలను రీమేక్ చేయగా ఇప్పుడు మరో సినిమా రీమేక్ కోసం ఎగపడుతున్నారు. ఆ సినిమా ఏదో కాదు.. నాని 'నిన్నుకోరి' సినిమా.