‘ఓ చిన్న కథ’ చెపుతున్న విజయ్

Vijay Croons For Master Movie

ప్రస్తుతం విజయ్ ‘ఖైదీ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన లోకేష్ కనగరాజు దర్శకత్వంలో మాస్టర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది విజయ్ కు 64 వ సినిమా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా నుండి ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేశారు. ‘ఓరు కుట్టి కథ’ అంటే ఓ చిన్న కథ పేరిట యానిమేషన్ లో వున్న ఒక పాటను రిలీజ్ చేశారు. ఇక అనిరుధ్ మ్యూజిక్ అందించగా విజయ్ స్వయంగా ఈ పాట పాడాడు. ‘ లెట్ మీ సింగ్ ఏ కుట్టి స్టోరీ .. పే అటెన్షన్.. లిజన్ టూ మీ’ అంటూ విజయ్ పాడిన ఈ పాట విపరీతంగా ఆకట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

కాగా ఈ సినిమాలో విజయ్‌ కు జోడీగా మాళవిక మోహనన్ నటిస్తుంది. ఎక్స్‌బి ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నాడు. మలయాళ నటుడు ఆంటొని, శాంతను కీలక పాత్రలు చేస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు… వచ్చే ఏడాది 2020 వేసవిలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =