
ట్యాగ్ · 3 కథనాలు

తమిళ సంవత్సరాదికి విజయ్ 'మాస్టర్'..!
'ఓ చిన్న కథ' చెపుతున్న విజయ్

'మాస్టర్' 100% ఆక్యుపెన్సీకి అనుమతి
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'మాస్టర్'. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. జనవరి 13న ఈ సినిమా విడుదలవుతుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ అవ్వగా వాటికి వచ్చిన రెస్పాన్స్ తో సినిమాపై మరింత భారీ అంచనాలు పెరిగాయి.
తమిళ సంవత్సరాదికి విజయ్ 'మాస్టర్'..!
ప్రస్తుతం విజయ్ ‘ఖైదీ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన లోకేష్ కనగరాజు దర్శకత్వంలో మాస్టర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టింది. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి 'ఓరు కుట్టి కథ' అనే ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను తమిళ సంవత్సరాది కానుకగా ఏప్రిల్ 9న విడుదల చేయాలనుకుంటున్నారట. అందుకోసం పోస్టు ప్రొడక్షన్ పనులను చాలా వేగంగా పూర్తి చేయాలని చర్యలు చేపడుతున్నారట. మరి ఇది నిజమో?కాదో? తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
'ఓ చిన్న కథ' చెపుతున్న విజయ్
ప్రస్తుతం విజయ్ ‘ఖైదీ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన లోకేష్ కనగరాజు దర్శకత్వంలో మాస్టర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది విజయ్ కు 64 వ సినిమా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా నుండి ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేశారు. 'ఓరు కుట్టి కథ' అంటే ఓ చిన్న కథ పేరిట యానిమేషన్ లో వున్న ఒక పాటను రిలీజ్ చేశారు. ఇక అనిరుధ్ మ్యూజిక్ అందించగా విజయ్ స్వయంగా ఈ పాట పాడాడు. ' లెట్ మీ సింగ్ ఏ కుట్టి స్టోరీ .. పే అటెన్షన్.. లిజన్ టూ మీ' అంటూ విజయ్ పాడిన ఈ పాట విపరీతంగా ఆకట్టుకుంటుంది.