
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి పాత టైటిల్స్ తో ఐదు కొత్త చిత్రాలు సందడి చేశాయి. అయితే, వాటిలో బ్లాక్ బస్టర్ గా నిలచిన చిత్రం మాత్రం `ఖైదీ` అనే చెప్పాలి. అలనాటి `ఖైదీ` (1983) చిరు కెరీర్ ని మేలిమలుపు తిప్పితే... ఈ నాటి `ఖైదీ` కష్టదశలో ఉన్న కార్తి కెరీర్ ని తిరిగి ట్రాక్ లోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలోనే... తనకు చిరు టైటిల్ కలసి రావడంతో వెనువెంటనే `దొంగ` టైటిల్ తో సందడి చేశాడు కార్తి. అయితే, `ఖైదీ` తరహాలో `దొంగ` మాత్రం మ్యాజిక్ చేయలేకపోయింది..