
ట్యాగ్ · 3 కథనాలు

రజినీ-కమల్ సినిమా ప్రకటన అప్పుడే..!

ఈ సారి చిరు టైటిల్ పై డైరెక్టర్ టార్గెట్

'తలైవా 171'లో రజినీలోని నెగెటివ్ షేడ్స్‌ను చూపిస్తా - లోకేశ్ కనగరాజ్
సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించనున్న 'తలైవా 171' గురించి ఒక అద్దిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రంలో రజినీకాంత్ నెగెటివ్ షేడ్స్‌లో కనిపించన్నారా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మేరకు దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దీనిపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాగా రజనీకాంత్ ప్రస్తుతం 'తలైవా 170' సినిమా చేస్తున్నారు. 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. దీని తర్వాత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'తలైవా 171' చేయనున్నారు. 'ఖైదీ', 'విక్రమ్' సినిమాలతో తన సత్తా ఏంటో చూపించారు లోకేశ్. ఇక ఇటీవలే కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్…
రజినీ-కమల్ సినిమా ప్రకటన అప్పుడే..!
‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్.. కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కమల్ సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో సినిమా చేస్తున్నాడు. అయితే ఇటీవలే ఈసినిమా ఆగిపోయిందంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే అదేం లేదని ఈ వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.

ఈ సారి చిరు టైటిల్ పై డైరెక్టర్ టార్గెట్
గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి పాత టైటిల్స్ తో ఐదు కొత్త చిత్రాలు సందడి చేశాయి. అయితే, వాటిలో బ్లాక్ బస్టర్ గా నిలచిన చిత్రం మాత్రం `ఖైదీ` అనే చెప్పాలి. అలనాటి `ఖైదీ` (1983) చిరు కెరీర్ ని మేలిమలుపు తిప్పితే... ఈ నాటి `ఖైదీ` కష్టదశలో ఉన్న కార్తి కెరీర్ ని తిరిగి ట్రాక్ లోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలోనే... తనకు చిరు టైటిల్ కలసి రావడంతో వెనువెంటనే `దొంగ` టైటిల్ తో సందడి చేశాడు కార్తి. అయితే, `ఖైదీ` తరహాలో `దొంగ` మాత్రం మ్యాజిక్ చేయలేకపోయింది..