రజనీకాంత్” దర్బార్ “మూవీ సీక్వెల్ ?

Rajinikanth Darbar Movie Makers Plans To Make A Sequel

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తమిళ సూపర్ స్టార్ , తలైవా రజినీకాంత్ హీరోగా , సూపర్ హిట్ మూవీస్ గజిని, స్టాలిన్, తుపాకీ ఫేమ్ ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ముంబై బ్యాక్ డ్రాప్ లో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “దర్బార్ ” తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ జనవరి 9వ తేదీ రిలీజ్ కానున్నాయి. లేడీ సూపర్ స్టార్ నయన తార కథానాయిక. నివేత థామస్, సునీల్ శెట్టి, ప్రతీక్ బబ్బర్ , యోగి బాబు ముఖ్య పాత్రలలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ ” దర్బార్ “మూవీ పై అంచనాలు పెంచాయి. లేడీ సూపర్ స్టార్ నయనతార బ్లాక్ బస్టర్ మూవీ “చంద్రముఖి “(2005 )తరువాత ” దర్బార్ “మూవీ లో రజనీకాంత్ జోడీ గా నటించడం విశేషం. దర్శకుడు మురుగదాస్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. “దర్బార్ ” మూవీ సీక్వెల్ రూపొందేలా ఆ మూవీ ఒక లీడ్ ఉందని, సీక్వెల్ రూపొందించే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =