రివైండ్ 2019… సీక్వెల్ హంగామా

2019 Special Sequel Movies

తెలుగునాట ఈ యేడాది ప‌లు సీక్వెల్ సినిమాలు సంద‌డి చేశాయి. కొన్ని క‌థాంశం విష‌యంలో సీక్వెల్ గా వ‌స్తే… మ‌రికొన్ని టైటిల్ వ‌ర‌కే ప‌రిమిత‌మ‌య్యాయి. ఆ చిత్రాల వివ‌రాల్లోకి వెళితే…

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మల్టీటాలెంటెడ్ రాఘవ లారెన్స్ కి న‌టుడిగానూ, దర్శకుడిగానూ… ‘ముని’ ఫ్రాంచైజీ ప్ర‌త్యేక గుర్తింపుని తెచ్చింది. మ‌రీ ముఖ్యంగా ‘ముని’ సిరీస్ లో రెండో చిత్రంగా వచ్చిన ‘కాంచన` తెలుగు, త‌మిళ భాష‌ల్లో సెన్సేష‌నల్ హిట్ అయింది. అలాగే మూడో భాగంగా వ‌చ్చిన `కాంచ‌న 2` (గంగ‌) కూడా విశేషంగా అల‌రించింది. ఈ నేప‌థ్యంలోనే… ఈ సంవ‌త్స‌రం `ముని` ఫ్రాంచైజీలో నాలుగో చిత్రంగా `కాంచ‌న 3`ని తెర‌కెక్కించాడు లారెన్స్. టాక్ ప‌రంగా మిక్స్ డ్ రెస్పాన్స్ వ‌చ్చినా, బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న‌విజ‌యం సాధించిందీ సినిమా.

ఇక‌పోతే, ఇదే సంవ‌త్స‌రంలో `ప్రేమ‌క‌థా చిత్ర‌మ్` (2013)కి సీక్వెల్ గా `ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ 2`, `అభినేత్రి`(2016)కి సీక్వెల్ గా `అభినేత్రి 2`, `రాజుగారి గది`(2015) ఫ్రాంచైజీలో మూడో చిత్రంగా `రాజుగారి గ‌ది 3`, `దండుపాళ్యం` (2013) సిరీస్ లో నాలుగో చిత్రంగా `దండుపాళ్యం 4` వచ్చాయి. అయితే, వీటిలో ఏ సీక్వెల్ కి అంత‌గా ఆద‌ర‌ణ ద‌క్క‌లేదు. అదేవిధంగా 2002 నాటి `మ‌న్మ‌థుడు`కి టైటిల్ సీక్వెల్ గా వ‌చ్చిన నాగార్జున `మ‌న్మ‌థుడు 2` కూడా ఆశించిన విజ‌యం అందుకోలేక‌పోయింది. మ‌రి… వ‌చ్చే ఏడాదిలో వ‌చ్చే సీక్వెల్స్ అయినా విజ‌య‌ప‌థంలో ప‌య‌నిస్తాయేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 2 =