సన్ పిక్చర్స్ బ్యానర్ పై తమిళ సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ హీరోగా సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ దర్శకత్వంలో రజనీకాంత్ 168 వ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. రజనీకాంత్ కు జంటగా నటించిన సీనియర్ హీరోయిన్స్ ఖుష్బూ, మీనా రజనీకాంత్ 168 మూవీ లో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. నేషనల్ అవార్డ్ గ్రహీత కీర్తి సురేష్ ఒక స్పెషల్ క్యారెక్టర్ కు ఎంపిక అయ్యారు. ప్రకాష్ రాజ్, సూరి, సతీష్, శ్రీమాన్ ఇతర పాత్రలలో నటిస్తున్నారు. డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మూడు దశాబ్దాలుగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించిన ఖుష్బూ తన సినీ కెరీర్ లో ఫస్ట్ టైమ్ నెగటివ్ రోల్ లో రజనీకాంత్ 168 మూవీ లో నటించడం విశేషం.. 28 సంవత్సరాల తరువాత రజనీకాంత్ సర్ తో స్క్రీన్ షేర్ చేసుకొనడం సంతోషంగా ఉందని ఖుష్బూ అన్నారు. బాల నటిగా ఎంటర్ అయ్యి తెలుగు, తమిళ భాషలలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించిన మీనా ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. రజనీకాంత్ హీరో గా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ “దర్బార్” మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: