ట్యాగ్ · 5 కథనాలు
వరుణ్ తేజ్ కి జోడీగా `ఇస్మార్ట్` భామలు?
వరుణ్ కొత్త చిత్రానికి ముహూర్తం ఖరారు?

బాబాయ్ బాటలో అబ్బాయ్

ఒలింపిక్ విన్నర్ తో వరుణ్ ట్రైనింగ్
వరుణ్ తేజ్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ?
ఈ ఏడాది `ఎఫ్ 2`, `గద్దలకొండ గణేష్` చిత్రాలతో రెండు వరుస ఘనవిజయాలను అందుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. స్వల్ప విరామం అనంతరం ఈ యువ కథానాయకుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించబోతున్నాడు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించనున్న ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ పాత్రలో నటించబోతున్నాడు. జనవరి నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుందని సమాచారం.
వరుణ్ తేజ్ కి జోడీగా `ఇస్మార్ట్` భామలు?
ఈ ఏడాది `ఎఫ్ 2`, `గద్దలకొండ గణేష్` చిత్రాలతో విజయాలు అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా చేయబోతున్న సంగతి తెలిసిందే. డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి రూపొందించనున్న ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ పాత్రలో దర్శనమివ్వనున్నాడు. కాగా... ఈ చిత్రంలో వరుణ్ కి జోడీగా `ఇస్మార్ట్ శంకర్` కథానాయికలు నిధి అగర్వాల్, నభా నటేష్ నటించబోతున్నారని సమాచారం.
వరుణ్ కొత్త చిత్రానికి ముహూర్తం ఖరారు?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్‌గా దర్శనమివ్వనున్నాడు. అంతేకాదు... ఈ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నాడు ఈ మ్యాచో స్టార్. తాజాగా ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ క్రేజీ ఎంటర్‌టైనర్... ఈ నెల 10న హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని సమాచారం. అయితే, రెగ్యులర్ షూటింగ్ మాత్రం 2020 ఆరంభంలో మొదలవుతుందని టాక్.

బాబాయ్ బాటలో అబ్బాయ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘వాల్మీకి’. వరుణ్‌కి జోడీగా పూజా హెగ్డే నటించిన ఈ మాఫియా కామెడీ ఎంటర్‌టైనర్‌ను హరీష్ శంకర్ తెరకెక్కించాడు. తమిళ్ మూవీ ‘జిగర్తండా’కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో... కోలీవుడ్ హీరో అధర్వ మురళి కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో... “గద్దల కొండ గణేష్” అలియాస్ “గని” అనే పేరుతో వరుణ్ తేజ్ సందడి చేయనున్నాడనే విషయాన్ని ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది.

ఒలింపిక్ విన్నర్ తో వరుణ్ ట్రైనింగ్
ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. మొదటి సినిమా నుండే ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ మంచి సక్సెస్ లు అందుకుంటున్నాడు. ఇక ఇదే జోష్ తో మరో సినిమా కోసం అప్పుడే కసరత్తులు మొదలుపెట్టేశాడు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఇక ఈసినిమా కోసం అప్పుడే ట్రైనింగ్ కూడా మొదలు పెట్టాడు.