`సింహా`, `లెజెండ్` వంటి బ్లాక్ బస్టర్స్ తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. మిర్యాల రవీందర్ రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఇద్దరు కథానాయికలకు స్థానమున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో ఓ నాయికగా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ఎంపికైందని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, సెకండ్ హీరోయిన్ గా కేథిరిన్ ట్రెసా ఎంపికైందని సమాచారం. ఇప్పటికే బోయపాటి దర్శకత్వంలో `సరైనోడు`, `జయ జానకి నాయక` (ప్రత్యేక గీతం) చిత్రాల్లో నటించిన కేథిరిన్ కి… బాలయ్యతో ఇదే తొలి సినిమా కావడం విశేషం. త్వరలోనే కేథరిన్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
కాగా, విజయ్ దేవరకొండ సరసన కేథరిన్ ఓ నాయికగా నటించిన `వరల్డ్ ఫేమస్ లవర్` ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: