ట్యాగ్ · 2 కథనాలు
బాలకృష్ణ కి జోడీగా కేథరిన్ ట్రెసా?
ఆ దర్శకుడికి మరో ఛాన్స్ ఇస్తున్న బాలకృష్ణ?
`అధినాయకుడు` (2012)... నటసింహ బాలకృష్ణ కెరీర్ లో ప్రత్యేకంగా నిలచిన చిత్రం. ఇందులో మూడు తరాలకు చెందిన మూడు విభిన్న పాత్రల్లో నటించి అలరించాడు బాలయ్య. అలాగే త్రిపాత్రాభినయంలో తనదైన ముద్రవేశాడు. అలాంటి... `అధినాయకుడు`కి దర్శకత్వం వహించిన పరుచూరి మురళి డైరెక్షన్ లో బాలయ్య ఎనిమిదేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత మరో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు... వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముందని టాక్.
బాలకృష్ణ కి జోడీగా కేథరిన్ ట్రెసా?
`సింహా`, `లెజెండ్` వంటి బ్లాక్ బస్టర్స్ తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. మిర్యాల రవీందర్ రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనుంది.