కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన థిల్లర్ మూవీ “నిశ్శబ్ధం ” జనవరి 31 వ తేదీ రిలీజ్ కానుంది. మాధవన్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడ్సన్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటించారు. భారీ బడ్జెట్ తో సియోటెల్ లో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ కి గోపిసుందర్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హాలీవుడ్ క్రాస్ ఓవర్ మూవీ “నిశ్శబ్ధం” తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో రిలీజ్ కానుంది.తెలుగు లో “నిశ్శబ్ధం” టైటిల్ తో , మిగతా భాషలలో “సైలెన్స్ “టైటిల్ తో రిలీజ్ కానుంది. ఇప్పుడు “నిశ్శబ్ధం” మూవీ కి సీక్వెల్ రూపొందించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. “నిశ్శబ్ధం” మూవీ సీక్వెల్ కు బేసిక్ ప్లాట్ రెడీ చేసినట్టు, “నిశ్శబ్ధం” మూవీ రిలీజ్ అయిన తరువాత సీక్వెల్ రూపొందనుందని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































