ట్యాగ్ · 3 కథనాలు

లక్కీ డేట్ కి వస్తున్న అల్లు అర్జున్
దంపతుల పాత్రల్లో బన్నీ, రష్మిక?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ ఓ యాక్షన్ థ్రిల్లర్ ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో బన్నీ స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని టాక్. కాగా... ఈ సినిమాలో బన్నీకి జోడీగా కన్నడ కస్తూరి రష్మికా మందన్న నటించనున్న విషయం విదితమే.
లిడో డాన్సర్స్‌తో డాన్స్ - ఫస్ట్ సౌత్ఇండియన్ స్టార్‌గా మరో రికార్డ్
త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ సామజవరగమనా సాంగ్ షూటింగ్ కోసం యూరప్‌లో వున్నసంగతి కూడా విదితమే. అయితే అక్కడ అల్లు అర్జున్ లిడో డాన్సర్స్‌తో కలిసి స్టెప్పులేసాడట. అంతేకాదు గత 25 సంవత్సరాలుగా ఎంతో ఫేమస్ అయిన లిడో డాన్స్‌ని బన్నీ చేయడంతో తాజాగా ఆయన ఖాతాలో మరో రికార్డ్ నమోదైంది. ఫస్ట్ టైమ్ పారిస్‌లో లిడో డాన్సర్స్‌తో డాన్స్ చేసిన సౌత్ఇండియన్ స్టార్‌గా రికార్డ్ క్రియేట్ చేసాడు.

లక్కీ డేట్ కి వస్తున్న అల్లు అర్జున్
సంక్రాంతి సీజన్‌కి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి మంచి అనుబంధమే ఉంది. ఎందుకంటే... ఇప్పటివరకు రెండు చిత్రాలతో ముగ్గుల పండక్కి సందడి చేసిన బన్నీకి... రెండు సందర్భాల్లోనూ మంచి విజయాలే దక్కాయి. ఈ నేపథ్యంలో... `అల వైకుంఠపురములో`తో ముచ్చటగా మూడోసారి సంక్రాంతికి సందడి చేయబోతున్నాడు ఈ టాలెంటెడ్ స్టార్. ఆసక్తికరమైన విషయమేమిటంటే... గత రెండు సందర్భాల్లో ఏ తేదికైతే బన్నీ చిత్రాలు విడుదలయ్యాయో... సరిగ్గా అదే తేదికి తన నెక్ట్స్ వెంచర్ కూడా రిలీజ్ కానుంది.