
ట్యాగ్ · 5 కథనాలు


వెంకటేష్ బర్త్‌డే స్పెషల్‌గా ‘వెంకీమామ’?
డిసెంబర్ 25న రానున్న ‘వెంకీమామ’?
సంక్రాంతి బరిలో ‘వెంకీమామ’?

పండగలను టార్గెట్ చేసుకున్న ఆర్మీ మేజర్స్

'వెంకీమామ' ఫైనల్ కాపీ - ఫుల్ హ్యాపీ లో చైతు
బాబి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నాగచైతన్య మల్టీస్టారర్ గా 'వెంకీమామ' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పటికీ కాస్త కన్ఫ్యూజన్ వుంది. క్రిస్మన్ అన్నారు... జనవరి సంక్రాంతి అన్నారు.. ఇప్పుడు అవేమి కాకుండా.. వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా అంటే డిసెంబర్ 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు... ఒకట్రెండు రోజుల్లో `వెంకీమామ` విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.

వెంకటేష్ బర్త్‌డే స్పెషల్‌గా ‘వెంకీమామ’?
డిసెంబర్ 13... విక్టరీ వెంకటేష్‌కి ఎంతో ప్రత్యేకమైన తేది. ఎందుకంటే... ఆ రోజు వెంకీ పుట్టినరోజు మాత్రమే కాదు పెళ్ళి రోజు కూడా. అలాంటి స్పెషల్ డేన ఇప్పటివరకూ వెంకీ నటించిన సినిమాలేవీ విడుదల కాలేదు. అయితే, ఆ ముచ్చటని తీర్చబోతున్నాడు `వెంకీమామ`.
డిసెంబర్ 25న రానున్న ‘వెంకీమామ’?
విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్‌లో వస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’. నిజజీవితంలో మేనమామ, మేనల్లుడు అయిన వెంకీ, చైతూ... ఇందులోనూ అవే పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. సురేష్ బాబు, టి.జి.విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహించాడు.
సంక్రాంతి బరిలో ‘వెంకీమామ’?
ఇద్దరు కథానాయకులు కలసి వెండితెరపై కనిపిస్తే ఆ సందడే వేరుగా ఉంటుంది. ఇక ఆ హీరోలిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవాళ్ళైతే డబుల్ బొనాంజా దక్కినట్టే. ఇప్పుడు ‘వెంకీమామ’తో అదే జరుగుతోంది. నిజజీవితంలో మేనమామ, మేనల్లుడు అయిన విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో... పాయల్ రాజ్‌పుత్, రాశి ఖన్నా నాయికలుగా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌కు కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో నాయకానాయికలపై తెరకెక్కించిన పాటతో చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా…

పండగలను టార్గెట్ చేసుకున్న ఆర్మీ మేజర్స్
ఆర్మీ నేపథ్యంలో తెలుగునాట పలు చిత్రాలు రూపొందాయి. ఇప్పుడు ఈ జాబితాలో మరో రెండు ఆసక్తికరమైన సినిమాలు చేరుతున్నాయి. ఆ చిత్రాలే... `సరిలేరు నీకెవ్వరు`, `వెంకీమామ`. ఈ రెండు సినిమాల్లోనూ కథానాయకులు వీరజవాన్లుగా నటిస్తుండడం ఓ విశేషమైతే.... ఆ యా చిత్రాలు ఫెస్టివల్ సీజన్స్‌లోనే రిలీజ్ కానుండడం మరో విశేషం.