
ట్యాగ్ · 7 కథనాలు


VD 12 కోసం ఎన్టీఆర్

VD 12.. క్రేజీ అప్డేట్స్

VD 12 శ్రీలంక షెడ్యూల్ కంప్లీట్

VD12 లీకులపై మేకర్స్ రియాక్షన్

VD 12 నుండి నో అప్డేట్

గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ తో VD 12

VD 12 టైటిల్, టీజర్ రిలీజ్.. ఎన్టీఆర్, సూర్య వాయిస్ ఓవర్ అదుర్స్
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ క్రమంలో తాజాగా ఆయన ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘VD 12’ (వర్కింగ్ టైటిల్) పై విజయ్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.

VD 12 కోసం ఎన్టీఆర్
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ రానుంది.సినిమా ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు ఒక్క మేజర్ అప్డేట్ కూడా ఇవ్వలేదు.దాంతో ఫ్యాన్స్ అసంతృప్తిగా వున్నారు.ఇక వారికీ కిక్ ఇచ్చే న్యూస్ వచ్చేసింది.ఈసినిమా టైటిల్ తోపాటు టీజర్ ను ఈనెల 12న రిలీజ్ చేయనున్నారు.ఈ టీజర్ కు స్టార్ హీరో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు.పాన్ ఇండియా సినిమా కావడంతో హిందీ టీజర్ కు రన్బీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు.

VD 12.. క్రేజీ అప్డేట్స్
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ క్రమంలో తాజాగా ఆయన 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'VD 12' (వర్కింగ్ టైటిల్) పై విజయ్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.

VD 12 శ్రీలంక షెడ్యూల్ కంప్లీట్
జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన 12వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈసినిమాపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.ఇక త్వరలోనే ఫస్ట్ లుక్ రివీల్ చేయనున్నారు.షూటింగ్ విషయానికి వస్తే నిన్నటితో ఈసినిమా శ్రీలంక షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.ఈ లాంగ్ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.సినిమాలో ఈ సీన్స్ హైలైట్ అవ్వనున్నాయట. ఈ షెడ్యూల్ తో 60శాతం షూటింగ్ పూర్తయింది.

VD12 లీకులపై మేకర్స్ రియాక్షన్
సినిమాలకు లీకులు అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఏదో ఒక రకంగా లీకులు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాకు కూడా లీకుల బెడదలు తప్పలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. ఈసినిమా 12 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ ను జరుపుకుంటుంది.

VD 12 నుండి నో అప్డేట్
విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా తన 12వ సినిమా నుండి అప్డేట్ వస్తుందని ఎదురుచూసిన ఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదు.ఈసినిమా నుండి ఎలాంటి అప్డేట్ ను మేకర్స్ రివీల్ చేయలేదు. అయితే ఈసినిమా చాలా ప్రత్యేకం అని ప్రస్తుతం భారీ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుందని త్వరలోనే మీకు నచ్చే అప్డేట్ తో వస్తాం అని ప్రెస్ నోట్ ను రిలీజ్ చేసింది మూవీ టీం.ఈసినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ తో VD 12
యంగ్ హీరో విజయ్ దేవరకొండ,జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది.ఈసినిమా గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ తో వస్తుంది.ఓ అండర్ కవర్ కాప్,గ్యాంగ్ స్టర్స్ ను ఎలా అంతమొందించాడు అనే పాయింట్ తో రానుందట.ఇందులో విజయ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.కెరీర్ లో మొదటి సారి విజయ్ ఫుల్ టైం యాక్షన్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు.