
ట్యాగ్ · 104 కథనాలు · పేజీ 6

పుష్ప :ది రూల్ మూవీ సెట్స్ లో రష్మిక
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ రష్మిక స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. బ్లాక్ బస్టర్ పుష్ప :ది రైజ్ మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ తో రష్మిక దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. సుల్తాన్ మూవీతో కోలీవుడ్ కు పరిచయం అయిన రష్మిక వారిసు (వారసుడు ) మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.రష్మిక ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల మూవీస్ తో బిజీగా ఉన్నారు. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప :ది రూల్, రణ్ బీర్ కపూర్ యానిమల్, టైగర్ ష్రాఫ్ స్క్రూ ఢీలా బాలీవుడ్ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

మోస్ట్ హ్యాండ్ సమ్ హీరో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి
సక్సెస్ ఫుల్ అందాల రాక్షసి మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన లావణ్య త్రిపాఠి పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. లావణ్య ఇప్పుడు పులి - మేక వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, జీ 5 బ్యానర్స్ పై పంతం మూవీ ఫేమ్ చక్రవర్తి రెడ్డి దర్శకత్వం లో ఆది సాయి కుమార్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలలో తెలుగు తమిళ భాషలలో తెరకెక్కిన పులి -మేక వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ జీ 5 లో 24 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ కు స్టార్ రైటర్ కోన కథను అందించారు. పులి -మేక వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠి ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ గా నటించడం విశేషం.

హిందీ రీమేక్ లో లవ్ టుడే
AGS ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ , ఇవానా జంటగా తెరకెక్కిన లవ్ టుడే తమిళ మూవీ నవంబర్ 4 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో సత్యరాజ్ , రాధిక , యోగిబాబు ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈ మూవీ కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో సుమారు 5 కోట్ల బడ్జెట్ తో అద్భుతంగా తెరకెక్కిన లవ్ టుడే మూవీ ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల క్లబ్ లో చేరింది.

ప్రభాస్ 1000 కోట్ల బిజినెస్
కృష్ణంరాజు వారసత్వంతోనే ప్రభాస్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈశ్వర్ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ప్రభాస్ హీరోగా నిలదొక్కుకొని ఆ తరువాత స్టార్ హీరోగా.. స్టార్ హీరో నుండి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు ప్రభాస్ రేంజ్ ఎలా ఉందో చూస్తున్నాం. ఈ స్థాయికి రావడానికి ప్రభాస్ కూడా ఎంత కష్టపడ్డాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అయితే పాన్ ఇండియా స్టార్ గా పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అయితే ప్రభాస్ చేసే సినిమాలు అన్నీ పాన్ ఇండియా సినిమాలే. ఓం రౌత్ తో ఆదిపురుష్ సినిమా, ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. నాగ్ అశ్విని దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే…