ట్యాగ్ · 4 కథనాలు

అక్కినేని నాగేశ్వరరావు 95వ జయంతి సంస్మరణ

మొన్న బన్నీ... నిన్న చెర్రీ... నేడు వరుణ్
‘ఆర్ ఆర్ ఆర్’ కోసం రాజమౌళి షాకింగ్ డెసిషన్?
‘బాహుబలి’ సిరీస్‌తో జాతీయ స్థాయిలో ఎనలేని గుర్తింపుని పొందాడు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి. ప్రస్తుతం ఈ విజనరీ డైరెక్టర్ ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రీకరణలో తలమునకలై ఉన్నాడు. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న ఈ భారీ మల్టీస్టారర్ మూవీలో కొమరం భీమ్‌గా తారక్... అల్లూరి సీతారామరాజుగా చరణ్ దర్శనమివ్వనున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన వార్తొకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

మెగాస్టార్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘స్టాలిన్’కు 13 ఏళ్ళు
“అన్నీ ఉండి... సాయం చేయాలనే మనసులేని వాళ్ళే నిజమైన అవిటివాళ్ళు” అనే సందేశాత్మక అంశంతో తెరకెక్కిన చిత్రం ‘స్టాలిన్’. మెగాస్టార్ చిరంజీవి, బ్రిలియంట్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌లో త్రిష కథానాయికగా నటించింది. ఖుష్బూ, శారద, ప్రకాష్ రాజ్, ప్రదీప్ రావత్, రవళి, సునీల్, ఎల్.బి.శ్రీరామ్, బ్రహ్మానందం, ముఖేష్ రిషి, సుమన్ తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించగా... అనుష్క ఓ ప్రత్యేక గీతంలో నర్తించింది. అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై చిరు సోదరుడు నాగబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.

అక్కినేని నాగేశ్వరరావు 95వ జయంతి సంస్మరణ
ఈరోజు సెప్టెంబర్ 20 - మహానటులు అక్కినేని నాగేశ్వరరావు జన్మదినం. కానీ జన్మదినాన్ని జయంతిగా జరుపుకోవలసి రావటం మన దురదృష్టం.1924 సెప్టెంబర్ 20న జన్మించిన అక్కినేని నాగేశ్వరరావు నిండు నూరేళ్లు జీవిస్తారని ఆశిస్తే 10 సంవత్సరాల ముందే 2014 జనవరి 22న తనువు చాలించారు.

మొన్న బన్నీ... నిన్న చెర్రీ... నేడు వరుణ్
మెగాహీరోలకు కలిసొచ్చిన సంగీత దర్శకులలో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కి ప్రత్యేక స్థానముంది. ముఖ్యంగా... మెగా కాంపౌండ్ హీరోలకి మొదటిసారిగా సంగీతమందించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో దేవిశ్రీ పనిచేసిన మొదటి సినిమా `శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్` (2004) వసూళ్ళ వర్షం కురిపించింది. అలాగే... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో డీఎస్పీ తొలిసారిగా జట్టుకట్టిన `జల్సా` (2008) అప్పట్లో బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఈ రెండు చిత్రాలకంటే ముందు... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో చేసిన `ఆర్య` (2004) మ్యూజికల్‌గానే…