
ట్యాగ్ · 6 కథనాలు


"#SURYA 40" మూవీ 35 శాతం షూటింగ్ కంప్లీట్
సూర్యతో మరోసారి కె.వి.ఆనంద్?

మరో బయోపిక్ లో సూర్య
లాయర్ పాత్రలో సూర్య?

సూర్యకి జోడీగా రష్మిక?

బుల్ ఫైట్ ట్రైనింగ్ లో సూర్య
స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా రూపొందిన పలు తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి. హీరో సూర్య తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన సూపర్ హిట్ "ఆకాశం నీ హద్దురా !"మూవీ లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటున్న సూర్య ప్రస్తుతం సన్ పిక్చర్స్ బ్యానర్ పై పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "#SURYA40" మూవీ లో నటిస్తున్నారు. వెట్రిమారన్ దర్శకత్వంలో ఒక మూవీ కి హీరో సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

"#SURYA 40" మూవీ 35 శాతం షూటింగ్ కంప్లీట్
స్టార్ హీరో సూర్య , అపర్ణ బాలమురళి జంటగా 2D ఎంటర్ టైన్ మెంట్ , సిఖ్య ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన “సూరరై పోట్రు “(ఆకాశం నీ హద్దురా !) తమిళ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 11 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. డెక్కన్ ఎయిర్ లైన్స్ అధినేత జి ఆర్ గోపీనాథ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన “ఆకాశం నీ హద్దురా !” మూవీ ప్రేక్షకుల ప్రశంసలతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.
సూర్యతో మరోసారి కె.వి.ఆనంద్?
కోలీవుడ్ స్టార్ సూర్యకి కలిసొచ్చిన దర్శకుల్లో కె.వి. ఆనంద్ ఒకరు. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన 'అయన్' (వీడొక్కడే), 'మాట్రాన్' (బ్రదర్స్), 'కాప్పాన్' (బందోబస్త్) చిత్రాలు మంచి ఆదరణనే పొందాయి. కట్ చేస్తే.. త్వరలోనే ఈ ఇద్దరి కాంబినేషన్ లో నాలుగో సినిమా రాబోతుందని తమిళ చిత్ర వర్గాల సమాచారం.

మరో బయోపిక్ లో సూర్య
కోలీవుడ్ స్టార్ సూర్య ఖాతాలో మరో బయోపిక్ చేరనుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న `సూరరై పోట్రు` (తెలుగులో `ఆకాశం నీ హద్దురా`) డెక్కన్ ఎయిర్ వేస్ అధినేత గోపీనాథ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ కాగా... తాజాగా సూర్య మరో బయోపిక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే, అది ఎవరి బయోపిక్ నో అన్న విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
లాయర్ పాత్రలో సూర్య?
వైవిధ్యభరితమైన పాత్రలకు చిరునామాగా నిలుస్తున్న తమిళ కథానాయకుల్లో సూర్య ఒకరు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే ఈ టాలెంటెడ్ స్టార్.. త్వరలో లాయర్ అవతారమెత్తనున్నాడు.

సూర్యకి జోడీగా రష్మిక?
అనతికాలంలోనే కన్నడ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకుంది చందనసీమ చిన్నది రష్మిక మందన్న. ఈ రెండు చోట్లా క్రేజీ ఆఫర్లను మూటగట్టుకుంటూనే.. మరోవైపు కోలీవుడ్ పై కూడా కన్నేసింది ఈ టాలెంటెడ్ బ్యూటీ. ఇప్పటికే `ఖైదీ` కార్తి సరసన `సుల్తాన్` అనే చిత్రంలో నటిస్తున్న రష్మిక.. తాజాగా అతని అన్న సూర్యతోనూ కలసి నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుందని తమిళ చిత్ర వర్గాల సమాచారం.