
ట్యాగ్ · 4 కథనాలు


సూపర్ స్టార్ కృష్ణ కు మహేష్ బాబు బర్త్ డే విషెస్

నాన్నకు ప్రేమతో .. మహేష్ బాబు

సూపర్ స్టార్ బర్త్ డే.. సుధీర్ బాబు సర్ ప్రైజింగ్ గ్లింప్స్..!
టాలీవుడ్ లో ఉన్న హీరోల్లో ప్రతి ఒక్కరికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అయితే ప్రయోగాలు చేయడానికి కొంతమంది మాత్రమే ముందుకు వస్తుంటారు. అలా ప్రయోగాలు చేసే వారిలో సుధీర్ బాబు కూడా ముందుంటాడు. సినిమా జయాపజయాలను పక్కనపెట్టి తన ప్రతి సినిమాకి కూడా ఏదో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు సుధీర్ బాబు. అందులో ఒకటే మామా మశ్చీంద్ర. ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది.

సూపర్ స్టార్ కృష్ణ కు మహేష్ బాబు బర్త్ డే విషెస్
సక్సెస్ ఫుల్ "తేనె మనసులు "(1965)మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృష్ణ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ అశేష అభిమానులను స్వంతం చేసుకున్నారు. నటుడు , నిర్మాత , దర్శకుడు , స్టూడియో అధినేత గా కళామతల్లి కి సేవలందించిన కృష్ణ టాలీవుడ్ లో ఫస్ట్ సూపర్ స్టార్ గా నిలిచారు. సుమారు 350 చిత్రాలలో నటించిన కృష్ణ 1965 నుండి 1995 వరకూ సంవత్సరానికి 10 సినిమాలలో నటించిన ఏకైక హీరోగా సూపర్ స్టార్ కృష్ణ రికార్డ్ క్రియేట్ చేశారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన సూపర్ స్టార్ కృష్ణ
సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. సాహసాలకు మారు పేరు కృష్ణ. ప్రయోగాత్మక సినిమాలు తీయాలంటే ఆయన తరువాతే. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ రాజ్యమేలుతున్న వేళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కృష్ణ తనదైన మార్గం నిర్దేశించుకున్నారు. ఒకరు జానపదం మరొకరు పౌరాణికాలకు పెట్టింది పేరుగా ముందుకు సాగుతున్న వేళ.. సాంఘిక చిత్రాలకు కేరాఫ్ గా మారారు కృష్ణ. అందులోనూ విత్ యాక్షన్ అంటే.. నిర్మాతలు దర్శకులకు ప్రముఖంగా సూపర్ స్టార్ కనిపించేవారు. తెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ చేసిన ప్రయోగాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల గురించి కాస్త పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. తెలుగు వెండి…

నాన్నకు ప్రేమతో .. మహేష్ బాబు
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటుడు , నిర్మాత , దర్శకుడిగా పలు రికార్డ్స్ క్రియేట్ చేసి సూపర్ స్టార్ కృష్ణ ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. లెజెండరీ యాక్టర్ కృష్ణ ఈ రోజు (మే 31 ) తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు నిన్నటి నుండే తమ అభిమాన హీరో కు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే శుభాకాంక్షలు అందజేస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు తన స్పెషల్ విషెస్ ను తెలిపారు.