
ట్యాగ్ · 24 కథనాలు · పేజీ 2

'పుష్ప' బర్త్ డే పోస్టర్ రిలీజ్

మాస్ కా బాప్ అనిపిస్తున్న 'పుష్ప రాజ్'

'పుష్ప రాజ్' కు టైమ్ ఫిక్స్

విజయ్ కోసం స్క్రిప్ట్ లాక్ చేసిన సుక్కూ
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండతో టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో ప్రకటించారు కూడా. అయితే కరోనా వల్ల అని సినిమాల్లాగే ఈసినిమా కూడా పెండింగ్ లోకి వెళ్లిపోయింది. ఇక ఈగ్యాప్ లో సినిమా ఆగిపోయిందంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ వార్తలపై అప్పుడే మేకర్స్ కూడా క్లారిటీ ఇచ్చారు. అవాస్తవాలని, విజయ్ దేవరకొండ - సుకుమార్ కాంబో సినిమా ముందుగా అనుకున్న ప్రకారమే సెట్స్ మీదకు వెళ్తుందని చిత్రనిర్మాణ సంస్థ ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ ప్రకటించింది.
'పుష్ప' బర్త్ డే పోస్టర్ రిలీజ్
సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా పుష్ప. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక బన్నీ పుష్ప రాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తుండగా ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ రోజు బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ని నిన్ననే విడుదల చేశారు. ఈ టీజర్‌లో విజువల్స్‌తో పాటు.. యాక్షన్.. బ్యాక్‌గ్రాండ్ మ్యూజిక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా టీజర్‌లో అల్లు అర్జున్ చెప్పిన ‘తగ్గేదే లే’ అనే డైలాగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ టీజర్ య్యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

మాస్ కా బాప్ అనిపిస్తున్న 'పుష్ప రాజ్'
తగ్గేదేలే.. బన్నీ పుష్ప సినిమాలో వాడే ఊత పదం అని ఇప్పటికే చెప్పారు.. ఇక బన్నీ పుట్టినరోజు సందర్భంగా నిన్న రిలీజ్ చేసిన టీజర్ లో కూడా ఈ ఒక్క పదం మాత్రమే చూపించారు.. మరి టీజర్ చూసిన తరువాత నిజంగానే బన్నీ తగ్గేలా కనిపించడం లేదు. ఏదో పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్ర.. మేకోవర్ ఛేంజ్ చేశాడు కొత్తగా ఉంటుందేమో అనుకున్నారు కానీ టీజర్ చూసిన తరువాత బన్నీ మరో బ్లాక్ బస్టర్ కు రెడీ అవుతున్నాడు అన్న అభిప్రాయాలే వినిపిస్తున్నాయి.

'పుష్ప రాజ్' కు టైమ్ ఫిక్స్
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'పుష్ప'. శేషాచలం అడువుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో చిత్తూరు జిల్లా యాసలో ఇరగదీయనున్నాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే మారేడు మిల్లి, రంపచోడవరం, టెన్ కాశీ లాంటి ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోగా.. తర్వాతి షెడ్యూల్‌ను చిత్తూరుతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని సత్య మంగళం అడవుల్లో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.