
ట్యాగ్ · 5 కథనాలు

సుధీర్ బాబు హరోం హర రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ నైట్రో స్టార్ సుధీర్ బాబు కూడా సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే హంట్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో హరోం హర సినిమా కూడా ఒకటి. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక రేపు సుధీర్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ సుధీర్ బాబుకు బర్త్ డే విషెస్ తెలియచేస్తూ ఒకరోజు ముందుగానే తన సినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు. ఫస్ట్ ట్రిగ్గర్ అంటూ ఒక చిన్న వీడియోను విడుదల చేశారు.

మూడు డిఫెరెంట్ గెటప్ లతో సుధీర్ బాబు మామ మశ్చీంద్ర
శివ మనసులో శృతి మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన సుధీర్ బాబు ప్రేమ కథా చిత్రమ్ మూవీ తో సక్సెస్ సాధించారు.సక్సెస్ ఫుల్ సమ్మోహనం మూవీ తో ప్రేక్షకులను అలరించిన సుధీర్ బాబు నన్ను దోచుకుందువటే మూవీ తో నిర్మాతగా మారారు. V మూవీ లో డి సి పి ఆదిత్య , శ్రీదేవి సోడా సెంటర్ మూవీ లో లైటింగ్ సూరి బాబు , యాక్షన్ థ్రిల్లర్ హంట్ మూవీ లో అర్జున్ గా సుధీర్ బాబు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కతన పాత్ర కై ఎంతటి ఎఫర్ట్స్ అయినా పెట్టే సుధీర్ బాబు ఇప్పుడు ఒక డిఫరెంట్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

మామ మశ్చీంద్ర సుధీర్ షాకింగ్ ఫస్ట్ లుక్
టాలీవుడ్ లో ప్రయోగాలు చేసే వారిలో సుధీర్ బాబు కూడా ముందుంటాడు. సినిమా జయాపజయాలను పక్కనపెట్టి తన ప్రతి సినిమాకి కూడా ఏదో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు సుధీర్ బాబు. ఈ ఏడాది హంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా మామ మశ్చీంద్ర.

గాయాలు కాదు తీపి గుర్తులు..!
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని హీరో గా 'వి' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో నాని నెగిటివ్ షేడ్ లో కనిపించనున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు వస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమాలో సుధీర్ బాబు కూడా మరో హీరో గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ లో భాగంగా తన చేతికి అయిన గాయాల్ని తలుచుకుంటూ.. ట్విట్టర్ ద్వారా ఓ ఫోటోని పోస్ట్ చేస్తూ స్వీట్ మెమోరీస్ అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు..

రామోజీ ఫిల్మ్ సిటీలో ‘వి’
`అష్టా చమ్మా`, `జెంటిల్ మన్` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత కథానాయకుడు నాని, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా `వి`. నాని సిల్వర్ జూబ్లీ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుధీర్ బాబు, అదితి రావ్ హైదరీ, నివేదా థామస్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత `దిల్` రాజు ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు.