
ట్యాగ్ · 4 కథనాలు


మహేష్ సినిమా గ్లోబల్ లెవెల్లో ఉంటుంది

పలు భాగాలుగా తెరకెక్కనున్న #SSMB 29

మహేష్-రాజమౌళి మూవీ క్రేజీ అప్ డేట్

అఫీషియల్.. SSMB29లో పృథ్వీరాజ్ సుకుమారన్
'ఆర్‌ఆర్‌ఆర్' తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. '#SSMB29' అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రాజమౌళి, మహేష్ కాంబోలో వస్తోన్న ఫస్ట్ మూవీ కావడంతో దీనిపై అంతటా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ నటి ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తోంది.

మహేష్ సినిమా గ్లోబల్ లెవెల్లో ఉంటుంది
సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ సూపర్ స్టార్ మహేష్ బాబు-దర్శక ధీరుడు రాజమౌళిది. వీరిద్దరి కాంబినేషన్ లో ఎప్పుడు సనిమా వస్తుందా అని ఆసక్తికరంగా చూస్తున్న తరుణంలోనే అధికారికంగా ప్రకటన ఇచ్చి షాకిచ్చారు. ఇక దాంతో ఈసినిమా కోసం ఇప్పటినుండే వెయిట్ చేస్తున్నారు. ఇక ఈసినిమా గురించి ఇప్పటికే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కానీ రాజమౌళి కానీ పలు సందర్భాల్లో ప్రస్తావించిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా గురింటి పలు ఆసక్తికర విషయాలు పంచుకోవడం కూడా జరిగింది. ఈసినిమా అడ్వెంచరస్ థ్రిల్లర్ అని, కథ సిద్దం చేస్తున్నట్టు ఇప్పటికే తెలిపారు.

పలు భాగాలుగా తెరకెక్కనున్న #SSMB 29
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజా హెగ్డే జంటగా #SSMB28 మూవీ తెరకె క్కుతుంది. ఈమూవీ తరువాత స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంచర్ #SSMB29 మూవీకి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మహేష్-రాజమౌళి మూవీ క్రేజీ అప్ డేట్
రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్.. ఈ కాంబినేషన్ కోసం ఎంత మంది ఎప్పటినుండి ఆశగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో తెలియదు కానీ ఇప్పటికే ఈసినిమాపై పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ సినిమా వస్తుందని ఎప్పుడైతే తెలిసిందే.. అప్పటినుండీ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వస్తూనే ఉంది. అంతేకాదు ఈసినిమా గురించి ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా ఎన్నోసార్లు పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు.