
ట్యాగ్ · 43 కథనాలు · పేజీ 3


'సీతారామం' తరుణ్ భాస్కర్ రోల్ రివీల్..!

"సీతారామం"భూమిక చావ్లా ఫస్ట్ లుక్ రిలీజ్
వైజయంతీ మూవీస్ స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ ఆగస్ట్ 5 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'సీతారామం' తరుణ్ భాస్కర్ రోల్ రివీల్..!
హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న సినిమా సీతారామం. పీరియాడిక్ లవ్‌స్టోరీతో వార్ బ్యాక్ డ్రాప్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు హనురాఘవపూడి. ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఒక అప్ డేట్ తరువాత మరో అప్ డేట్ ఇస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, గ్లింప్స్, వరుసగా పోస్టర్లు రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. రెండు రోజులు క్రితమే ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సుమంత్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈసినిమాలో నటిస్తున్న మరో కీలక…

'సీతారామం' సుమంత్ ఫస్ట్ లుక్ రిలీజ్..!
అందాల రాక్షసి, కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, పడి పడి లేచే మనసు లాంటి ప్రేమ కథలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన డైరెక్టర్ హను రాఘవపూడి. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వస్తున్నాడు. మలయాళం సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా ఈసినిమా తెరకెక్కుతుండగా.. పాన్ ఇండియా రేంజ్ లో ఈసినిమాను రూపొందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మిలటరీ ప్రేమ కథగా ఈసినిమా రాబోతుందని అర్థమవుతుంది. ఇక ఈసినిమాలో నటిస్తున్న పాత్రలకు సంబంధించిన పోస్టర్లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా.