
ట్యాగ్ · 4 కథనాలు

స్టార్ హీరోల సినిమాల్లో సిద్దు కి ఛాన్స్..!

కమల్‌కి విలన్‌గా సిద్ధార్థ్?

'మహా సముద్రం' లో నెగెటివ్ పాత్రలో సిద్దార్థ్..!
అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరోహీరోయిన్లు గా వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమా ఎంత సన్సేషన్ హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అయింది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టింది. ఇక ఈ సినిమా తర్వాత కార్తికేయ, పాయల్ ఇప్పటికే పలు సినిమాల్లో నటించగా.. అజయ్ భూపతి మాత్రం తన రెండో సినిమాను ఇంతవరకూ పట్టాలెక్కించలేదు.

తెలుగు ప్రేక్షకులకు స్క్రిప్ట్ రెడీ చేస్తున్న సిద్ధార్థ్
"బాయ్స్" మూవీ తో కోలీవుడ్, టాలీవుడ్ లకు పరిచయమైన సిద్ధార్థ్ బ్లాక్ బస్టర్ "నువ్వొస్తానంటే నేనొద్దంటానా " మూవీ లో అద్భుతంగా నటించి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకొన్నారు. "బొమ్మరిల్లు ", "జబర్దస్త్", "లవ్ ఫెయిల్యూర్" వంటి హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. తరువాత సిద్ధార్థ్ కోలీవుడ్ లో బిజీగా మారారు.
స్టార్ హీరోల సినిమాల్లో సిద్దు కి ఛాన్స్..!
ఈ వయసులో కూడాయంగ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన దర్బార్ తో హిట్ కొట్టిన రజినీ అదే జోష్ తో అప్పుడే మరో సినిమాను లైన్ లో పెట్టేసాడు. శివ డైరెక్షన్లో రజినీ తన కొత్త సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. అంతేకాదు ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ముగిసినట్టు తెలుస్తుంది.

కమల్‌కి విలన్‌గా సిద్ధార్థ్?
ఏస్ ఫిల్మ్ మేకర్ శంకర్ రూపొందించిన `బాయ్స్` (2003) చిత్రంతో కథానాయకుడిగా తొలి అడుగులు వేసిన సిద్ధార్థ్... మొదటి సినిమాతోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత పలు దక్షిణాది చిత్రాలతో పాటు హిందీ చిత్రాల్లోనూ నటించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇటీవలే వచ్చిన హారర్ మూవీ `గృహం`తో తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకున్నాడు సిద్ధు.