
ట్యాగ్ · 6 కథనాలు


'ఒకే ఒక జీవితం' రిలీజ్ డేట్ ఫిక్స్..!

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో శర్వానంద్ మూవీ?

తక్కువ గ్యాప్‌లోనే వస్తున్న శర్వానంద్?

నాని, శర్వానంద్ ఒకే తేదిని టార్గెట్ చేశారా?

ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పాలి
విభిన్నమైన పాత్రలు, సినిమాలు చేయడంలో టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కూడా ఎప్పుడూ ముందుంటాడు. అలాంటి శర్వాకు ఈమధ్య సరైన హిట్ పడింది లేదు. రీసెంట్ గా వచ్చిన ఆడవాళ్ళూ మీకు జోహార్లు సినిమా కాస్త ఊరట నిచ్చింది. ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు. శ్రీకార్తిక్ దర్శకత్వంలో శర్వా హీరోగా వస్తున్న సినిమా ఒకే ఒక జీవితం. నిజానికి ఈసినిమా చాలా లేట్ గానే రిలీజ్ అవుతుంది. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టారు కానీ రిలీజ్ అవ్వడానికి మాత్రం చాలా రోజులు టైమ్ తీసుకుంది. ఫైనల్ గా ఈ నెల 9వ తేదీన తెలుగు .. తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

'ఒకే ఒక జీవితం' రిలీజ్ డేట్ ఫిక్స్..!
గత ఏడాది రెండు సినిమాలతో అలరించిన శర్వానంద్ ఈ ఏడాది ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాతో అలరించాడు. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేశాడు. శ్రీకార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ చేస్తున్న సినిమా ఒకే ఒక జీవితం. ఈసినిమా ఎప్పుడో స్టార్ట్ చేశారు కానీ రిలీజ్ కు మాత్రం చాలా లేట్ అయిందనే చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ జానర్ కావడంతో వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు అద్భుతంగా చూపించడానికి చిత్ర యూనిట్ ప్రత్యేక ద్రుష్టి పెట్టింది.

మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శర్వానంద్?
ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో చిత్రాన్ని లైన్‌లో పెట్టే యువ కథానాయకులలో శర్వానంద్ ఒకరు. ఆ మధ్య టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్షన్‌లో సినిమా చేస్తూనే… తమిళ రీమేక్ చిత్రం ‘96’ను పట్టాలెక్కించాడు ఈ టాలెంటెడ్ హీరో. ఇక తాజాగా సుధీర్ వర్మ కాంబినేషన్ మూవీని పూర్తి చేసిన శర్వా… ఇప్పుడు ‘96’ షూటింగ్‌లో పాల్గొంటూనే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్ళే ఆలోచనలో ఉన్నాడట.

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో శర్వానంద్ మూవీ?
యువ కథానాయకుడు శర్వానంద్, టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్లో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ రెండు విభిన్న ఛాయలున్న పాత్రలో దర్శనమివ్వనున్నాడు. కథానుసారం… శర్వానంద్ ప్లే బాయ్, ఏజ్డ్ గ్యాంగ్ స్టర్.. ఇలా టు డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపిస్తాడట.

తక్కువ గ్యాప్‌లోనే వస్తున్న శర్వానంద్?
వైవిధ్యభరితమైన చిత్రాలతో ముందుకు సాగుతున్న యువ కథానాయకుడు శర్వానంద్. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే ఈ టాలెంటెడ్ హీరో... ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒకటి సుధీర్ వర్మ రూపొందిస్తున్న పేరు నిర్ణయించని చిత్రం కాగా... మరొకటి తమిళ్ బ్లాక్‌బస్టర్ మూవీ `96`కి రీమేక్‌గా రూపొందుతున్న సినిమా. ఈ రెండు కూడా కేవలం మూడు నెలల గ్యాప్‌లో తెరపైకి వచ్చే అవకాశముందని టాలీవుడ్ టాక్.

నాని, శర్వానంద్ ఒకే తేదిని టార్గెట్ చేశారా?
నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం `జెర్సీ`, శర్వానంద్ పేరు నిర్ణయించని అప్‌కమింగ్ ప్రాజెక్ట్ (సుధీర్ వర్మ దర్శకుడు)... వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల మధ్య నెలకి పైగా గ్యాప్ ఉండనుంది. అయితే... ఈ ఇద్దరి తదుపరి చిత్రాలు మాత్రం ఒకే రోజున విడుదలయ్యే అవకాశముందని టాలీవుడ్ టాక్.