ట్యాగ్ · 25 కథనాలు · పేజీ 2
మరో ప్రేమ కథా చిత్రం లో శర్వానంద్ ?

హీరో శర్వానంద్ తమిళ మూవీ ?
శర్వానంద్ న్యూ మూవీ అనౌన్స్ మెంట్
శర్వానంద్ తో అజయ్ భూపతి `మహాసముద్రం`?
గ్రీన్ ఛాలెంజ్ - పార్క్ ను దత్తత తీసుకున్న శర్వానంద్..!
గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్ మొక్కలు నాటిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో యంగ్ హీరో శర్వానంద్ కూడా చేరాడు. గొప్ప విషయం ఏంటంటే గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వచ్ఛందంగా స్వీకరించాడు శర్వా. బంజారాహిల్స్ లోని తన ఇంటి పక్కన ఉన్న పార్క్‌లో ఎంపీ సంతోష్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి మొక్కలు నాటారు.అంతేకాదు తమ ఇంటి పక్కన ఉన్న జీహెచ్ఎంసీ పార్కును దత్తత తీసుకొని అందులో మొక్కలు నాటుతానని కూడా చెప్పాడు. అనంతరం ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను నిర్మాతలు ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత అనిల్ సుంకర, 14 రీల్స్ ప్లస్ రామ్ ఆచంట- గోపి…
మరో ప్రేమ కథా చిత్రం లో శర్వానంద్ ?
యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న "శ్రీకారం "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ "RX 100" మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందనున్న యాక్షన్ థ్రిల్లర్ "మహా సముద్రం" మూవీ కి శర్వానంద్ ఓకే చెప్పారు. శర్వానంద్ ఇప్పుడు మరో వైవిధ్య భరిత ప్రేమ కథా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

హీరో శర్వానంద్ తమిళ మూవీ ?
"రన్ రాజా రన్ ", మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు", "శతమానం భవతి", "మహానుభావుడు" వంటి సూపర్ హిట్ మూవీస్ లో నటించిన హీరో శర్వానంద్ కథానాయకుడిగా, చేరన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషలలో రూపొందిన "రాజాధిరాజా" మూవీ 2015 సంవత్సరంలో తమిళ భాషలో రిలీజ్ అయ్యింది. ఆ మూవీ తరువాత తెలుగు మూవీస్ తో బిజీగా ఉన్న శర్వానంద్ తమిళ మూవీస్ లో నటించలేదు. శర్వానంద్ ఇప్పుడు ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
శర్వానంద్ న్యూ మూవీ అనౌన్స్ మెంట్
హీరో శర్వానంద్ బర్త్ డే సందర్భంగా ఈ రోజు ఒక కొత్త సినిమా ప్రకటన వెలువడింది. శ్రీ లక్ష్మీవెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం 3 గా సూపర్ హిట్ మూవీస్ "నేను శైలజ ", "చిత్రలహరి" ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్ కథానాయకుడు గా ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ మూవీ రూపొందనుంది.
శర్వానంద్ తో అజయ్ భూపతి `మహాసముద్రం`?
గత ఏడాది సంచలనం `ఆర్ ఎక్స్ 100`తో దర్శకుడిగా తొలి అడుగు వేశాడు అజయ్ భూపతి. ఆ సినిమా విడుదలై ఏడాది దాటినా రెండో చిత్రం పట్టాలెక్కలేదు. వాస్తవానికి, `మహాసముద్రం` పేరుతో ఓ మల్టీస్టారర్ ని చేయాలని అజయ్ భావించాడు. అయితే, పలు కారణాల వల్ల ఈ క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ యాక్షన్ ఫిల్మ్ సెట్స్ పైకి వెళ్ళబోతోందని సమాచారం.