ట్యాగ్ · 6 కథనాలు
సీటీమార్ సెట్లో - ఫుల్ స్వింగ్ లో షూట్
ఆగష్ట్ లో లాస్ట్ షెడ్యూల్ జరుపుకోనున్న `సీటీమార్`
గోపీచంద్ ‘సీటీమార్’.. ఫస్టాఫ్ తాలూకు షూటింగ్ పూర్తి
కామెడీ , యాక్షన్ ఎంటర్ టైనర్ గా "సీటీ మార్"
మూడో షెడ్యూల్ లో `సీటీమార్`
సీటీమార్ లో డ్యాన్స్, స్టైల్ అదిరిపోయాయి బ్రదర్..!
ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా రాధేశ్యామ్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక సీటీమార్ పాటతో ఈసినిమా ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన 'DJ-దువ్వాడ జగన్నాథం' చిత్రం కోసం దేవిశ్రీ కంపోజ్ చేసిన 'సీటీమార్' సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ పాట బాగా నచ్చి సల్మాన్ రీమిక్స్ చేయమని కోరడంతో.. దేవిశ్రీ హిందీలో ఈ పాటను మళ్ళీ కంపోజ్ చేశారు. ఈపాట ఇప్పుడు యూట్యూబ్లో హల్ చల్ చేస్తుంది.
సీటీమార్ సెట్లో - ఫుల్ స్వింగ్ లో షూట్
హీరో గోపీచంద్ సంపత్ నంది కాంబినేషన్‌లో ‘సీటీమార్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లాక్ డౌన్ కి ముందే మూడు షెడ్యూల్స్ లో 60% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే కరోనా వల్ల సినిమా షూటింగ్లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూట్ కు కూడా బ్రేక్ పడింది. ఇక ఇటీవలే షూటింగ్ ను మళ్లీ స్టార్ట్ చేశారు చిత్ర యూనిట్. అంతేకాదు ఈ సినిమా కోసం వేసిన భారీ సెట్ లో చేస్తున్న ఏర్పాట్లకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. అవసరమైన అన్నిజాగ్రత్తలు తీసుకుంటూ నాన్ స్టాప్‌గా షూటింగ్ జరిపి చిత్రీకరణ పూర్తిచేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ఆగష్ట్ లో లాస్ట్ షెడ్యూల్ జరుపుకోనున్న `సీటీమార్`
ప్రస్తుతం హీరో గోపీచంద్ సంపత్ నంది కాంబినేషన్‌లో ‘సీటీమార్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ యాక్ట్రస్ భూమిక ఓ కీలక పాత్ర పోషించనుంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడుఈ సంవత్సరంలో మొదలయిన ఈ సినిమా లాక్ డౌన్ కి ముందే మూడు షెడ్యూల్స్ లో 60% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే కరోనా వల్ల సినిమా షూటింగ్లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.
గోపీచంద్ ‘సీటీమార్’.. ఫస్టాఫ్ తాలూకు షూటింగ్ పూర్తి
‘గౌతమ్ నంద’(2017) తరువాత యాక్షన్ హీరో గోపీచంద్, టాలెంటెడ్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ‘సీటీమార్’. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా నాయికగా నటిస్తుండగా.. సీనియర్ యాక్ట్రస్ భూమిక ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనుంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ బాణీలు అందిస్తున్నాడు.
కామెడీ , యాక్షన్ ఎంటర్ టైనర్ గా "సీటీ మార్"
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా కామెడీ, యాక్షన్ ఎంటర్ టైనర్ "సీటీ మార్" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కబడ్డీ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో గోపీచంద్, తమన్నా కబడ్డీ కోచ్ లుగా నటిస్తున్నారు. దిగాంగన, భూమిక ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు.
మూడో షెడ్యూల్ లో `సీటీమార్`
`గౌతమ్ నంద`(2017) తరువాత యాక్షన్ హీరో గోపీచంద్, టాలెంటెడ్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్ లో వస్తున్న చిత్రం `సీటీమార్`. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కథానాయికగా నటిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో భూమికా చావ్లా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నాడు.