
ట్యాగ్ · 4 కథనాలు

తానే నిర్మాతగా హారర్ థ్రిల్లర్ లో సామ్..?

టెర్రరిస్ట్ పాత్రలో సమంత?

మరోసారి ఆకట్టుకున్న సమంత

"మహాసముద్రం " మూవీ హీరోయిన్ సమంత ?
బ్లాక్ బస్టర్ "RX 100"మూవీ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో "మహాసముద్రం " మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ మూవీ లో శర్వానంద్ కు జోడీ గా సమంత ఎంపిక అయ్యారని సమాచారం. హీరో శర్వానంద్, సమంత జంటగా నటించిన "96 " మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం సూపర్ హిట్ తమిళ మూవీ "96 " కు తెలుగు రీమేక్ గా రూపొందింది.
తానే నిర్మాతగా హారర్ థ్రిల్లర్ లో సామ్..?
పెళ్ళైన తర్వాత సమంత వైవిధ్యమైన కథలతో.. వరుస హిట్లతో .. వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. ఈ యేడాది మొదట్లో నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సినిమా, రీసెంట్‌గా ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టాయి. సమంత ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న తమిళ సినిమా '96' రీమేక్‌లో శర్వానంద్‌కు జోడిగా నటిస్తోంది. వీటితో పాటు ఈమె `ది ఫ్యామిలీ మ్యాన్` వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు.

టెర్రరిస్ట్ పాత్రలో సమంత?
వైవిధ్యభరితమైన పాత్రలకు చిరునామాగా నిలుస్తున్న కథానాయిక సమంత. పెళ్ళయ్యాక కొత్త తరహా పాత్రలకే ఓటేస్తూ ముందుకు సాగుతున్న సామ్... తాజాగా మరో డిఫరెంట్ రోల్‌లో నటించిందని సమాచారం.

మరోసారి ఆకట్టుకున్న సమంత
పెళ్ళయ్యాక సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది అందాల తార సమంత. గత ఏడాది `రంగస్థలం`, `మహానటి`, `యూ టర్న్` చిత్రాల్లో ఒకదానితో ఒకటి సంబంధం లేని పాత్రల్లో కనిపించి అలరించిన సామ్... ఈ ఏడాది కూడా అదే బాటలో వెళ్ళనుంది. `సూపర్ డీలక్స్`, `మజిలీ`, `ఓ బేబి` ... ఇలా తన కొత్త చిత్రాల్లో ఇదివరకు ఎన్నడూ చేయని పాత్రల్లో సమంత దర్శనమివ్వనుంది.