
ట్యాగ్ · 286 కథనాలు · పేజీ 15

బల్గేరియా షెడ్యూల్ పూర్తిచేసుకున్న ‘ఆర్ ఆర్ ఆర్’

RRRమూవీ లో యంగ్ "టైగర్" ఫైట్

ఎన్టీఆర్ కు జోడిగా మళ్ళీ బ్రిటిష్ హీరోయినే..!
ఎన్టీఆర్ జోడీగా మళ్లీ హాలీవుడ్ బ్యూటీ..!

జూన్ 24 నుంచి ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్‌లో చరణ్!?

మూడు పాటలతో తెరకెక్కనున్న ‘ఆర్ ఆర్ ఆర్’?
వాస్తవిక పాత్రలు, కల్పిత ఘటనలతో రూపొందుతున్న పేట్రియాటిక్ డ్రామా ‘ఆర్ ఆర్ ఆర్’. `బాహుబలి` సిరీస్ తరువాత దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ... కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు మధ్య చిగురించిన స్నేహం, ఒకరి జీవితంపై మరొకరి ప్రభావం అనే ఆసక్తికరమైన అంశాలతో రూపొందుతోంది. కొమరం భీమ్‌గా తారక్... అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను... తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో ఒకే రోజున విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే... ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది.
బల్గేరియా షెడ్యూల్ పూర్తిచేసుకున్న ‘ఆర్ ఆర్ ఆర్’
కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు... వీరిద్దరూ వేర్వేరు ప్రాంతాలకు చెందిన పోరాట యోధులు. నిజ జీవితంలో వీరిద్దరూ కలిసినట్లు చారిత్రక ఆధారాలు లేకపోయినా... కలిస్తే ఎలా ఉంటుంది? అనే వినూత్నమైన ఆలోచనలోంచి పుట్టిన కథే ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రం. దర్శకధీరుడు రాజమౌళి తెరరూపం ఇస్తున్న ఈ పేట్రియాటిక్ డ్రామాలో... కొమరం భీమ్‌గా యన్టీఆర్, అల్లూరిగా రామ్ చరణ్ నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కథానాయికగా దర్శనమివ్వనున్న ఈ మాసివ్ మల్టీస్టారర్‌లో... బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవగణ్, తమిళ దర్శకనటుడు సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు.

RRRమూవీ లో యంగ్ "టైగర్" ఫైట్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ స్టారర్ మూవీ RRR 2020 సంవత్సరం జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో ఎన్టీఆర్ కొమరంభీమ్, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఒక కథానాయికగా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఎన్టీఆర్ కు జోడిగా మళ్ళీ బ్రిటిష్ హీరోయినే..!
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. ప్రస్తుతం రామ్ చరణ్ బ్రేక్ లో ఉండగా.. ఎన్టీఆర్ కి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం బల్గెరియా వెళ్లనున్నారట చిత్ర యూనిట్.
ఎన్టీఆర్ జోడీగా మళ్లీ హాలీవుడ్ బ్యూటీ..!
బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర పోషిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు రోల్ లో నటిస్తున్నాడు. చెర్రీ సరసన ఆలియా భట్ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది.

జూన్ 24 నుంచి ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్‌లో చరణ్!?
యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ `ఆర్ ఆర్ ఆర్`. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామా... మెరుపువేగంతో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే... ఇటీవల ఫ్యామిలీతో హాలిడే ట్రిప్‌కి వెళ్ళొచ్చిన చరణ్... స్వల్ప విరామం తరువాత మళ్ళీ `ఆర్ ఆర్ ఆర్` సెట్‌లోకి అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది.