
ట్యాగ్ · 28 కథనాలు · పేజీ 2


`అయ్యప్పనుమ్ కోషియుమ్`రీమేక్‌లో రవితేజ?
రవితేజ సినిమాలో స్టార్ డాటర్స్
రవితేజ సినిమాలో సముద్రఖని

విలన్‌గా మారనున్న యంగ్ హీరో?

డిస్కో రాజా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ అప్ డేట్

మరో ప్రయోగం చేయనున్న రవితేజ

`కనకదుర్గ`గా రవితేజ?

రవితేజ కు జోడీగా మలయాళ హీరోయిన్ రజిష విజయన్ ?
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం యాక్షన్ ఎంటర్ టైనర్ "ఖిలాడి "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. హీరో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న "ఖిలాడి " మూవీ మే 28 వ తేదీ రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణం గా విడుదల వాయిదా పడింది. కరోనా పరిస్థితులు సాధారణ స్థితి కి చేరుకోగానే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామనీ , "ఖిలాడి " మూవీ థియేటర్స్ లోనే రిలీజ్ కానుందనీ మేకర్స్ తెలిపారు.

`అయ్యప్పనుమ్ కోషియుమ్`రీమేక్‌లో రవితేజ?
ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ చేతిలో రెండు చిత్రాలున్నాయి. అందులో ఒకటి `క్రాక్` కాగా.. మరొకటి `రాక్షసుడు` ఫేమ్ రమేష్ వర్మ రూపొందిస్తున్న యాక్షన్ థ్రిల్లర్. ఈ రెండు సినిమాలతో పాటు... ‘సినిమా చూపిస్త మావ’, ‘నేను లోకల్’ వంటి కామెడీ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించిన త్రినాథరావు నక్కినతో కూడా ఓ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ చేయనున్నాడు రవితేజ. కాగా, తాజాగా ఓ మల్టీస్టారర్ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట మాస్ మహారాజా.
రవితేజ సినిమాలో స్టార్ డాటర్స్
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కమల్ హాసన్ తనయ శ్రుతి హాసన్ కథానాయికగా నటించనుండగా... మరో స్టార్ డాటర్ కీలక పాత్రలో దర్శనమివ్వనుంది. ఆమె మరెవరో కాదు... సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీ శరత్ కుమార్.
రవితేజ సినిమాలో సముద్రఖని
తమిళనాట దర్శకుడిగానూ, నటుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సముద్రఖని... తెలుగువారికి కూడా సుపరిచితుడే. మాస్ మహారాజా రవితేజ నటించిన ‘శంభో శివ శంభో’(2010), నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెండాపై కపిరాజు’(2014)... సముద్రఖని దర్శకత్వంలోనే రూపొందాయి. ఓ వైపు దర్శకుడిగా రాణిస్తూనే, మరోవైపు నటుడిగానూ పలు తమిళ చిత్రాలలో నటిస్తూ వస్తున్న ఈ డైరెక్టర్ కమ్ యాక్టర్... ఇప్పుడు నటుడిగా తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించడానికి సిద్ధపడుతున్నాడు.

విలన్‌గా మారనున్న యంగ్ హీరో?
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రోగ్’ (2017) చిత్రంతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయమయ్యాడు ఇషాన్. మొదటి సినిమాతోనే అటు నటనపరంగానూ, ఇటు పర్సనాలిటీ పరంగానూ ఆకట్టుకున్నాడు ఇషాన్. కాగా… స్వల్ప విరామం తరువాత ఈ యంగ్ హీరో టాలీవుడ్‌లో మరోసారి సందడి చేయనున్నాడు. అయితే.. ఈ సారి హీరోగా కాదు.. విలన్‌గా అట.

డిస్కో రాజా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ అప్ డేట్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా తరువాత రవితేజ మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే డిస్కో రాజా లాంటి వైవిథ్యమైన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. విలక్షణ దర్శకుడు వి.ఐ. ఆనంద్ ఈ సినిమాకి దర్శకుడు. పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈసినిమా కొద్ది రోజులు షూటింగ్ కూడా జరుపుకుంది. అయితే ఏమైందో ఏమో తెలియదు కాని ఈ సినిమా షూటింగ్ ఆగిపోయినట్టు.. బడ్జెట్ విషయంలో విబేధాలు తలెత్తాయని ఫిలిం వర్గాల్లో ప్రచారం జరిగింది.

మరో ప్రయోగం చేయనున్న రవితేజ
గత కొద్ది కాలంగా ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు మాస్ మహారాజ రవితేజ. ఈ నేపథ్యంలో ఈసారి మరో డిఫరెంట్ స్టోరీ తో ముందుకు వస్తున్నాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ డిస్కోరాజా సినిమాలో నటిస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది.

`కనకదుర్గ`గా రవితేజ?
మూడేళ్ళ క్రితం వేసవి కానుకగా విడుదలైన కాప్ స్టోరీ `తెరి`... తమిళనాట వసూళ్ళ వర్షం కురిపించింది. విజయ్, సమంత, అమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో అట్లీ రూపొందించిన ఈ చిత్రం... ఇప్పుడు తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా `కందిరీగ` ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఒరిజినల్ వెర్షన్‌లోని థీమ్‌ని మాత్రమే తీసుకుని... భారీ మార్పులు చేర్పులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు సంతోష్. ఏప్రిల్ 15 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం…