
ట్యాగ్ · 4 కథనాలు

రవితేజ "ఖిలాడి "?

టైగర్ నాగేశ్వరరావు లో రవితేజ డిఫరెంట్ లుక్స్
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మిగిలిన సినిమాల పెండింగ్ షూటింగ్ లను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అందులో టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా ఒకటి. వంశీ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా కూడా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే ఈసినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చాయి. తాాజాగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈసినిమాలో రవితేజ మూడు డిఫరెంట్ లుక్స్ లలో కనిపించనున్నాడట. స్టైలిష్, రగ్డ్, యంగ్…

మాస్ మహారాజా రవితేజ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వర రావు
తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై వంశీ దర్శకత్వం లో మాస్ మహారాజా రవితేజ హీరోగా స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో నుపుర్ సనన్ కథానాయిక కాగా గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ తో 18 సంవత్సరాల తరువాత రేణు దేశాయ్ టాలీవుడ్ కు రీఎంట్రీ ఇస్తున్నారు. జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుండి ఫస్ట్ పోస్టర్, రేణు దేశాయ్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
రవితేజ "ఖిలాడి "?
కోనేరు సత్యనారాయణ నిర్మాతగా సక్సెస్ ఫుల్ "రాక్షసుడు" మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా ఒక మాస్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందనుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ మూవీ కి "ఖిలాడి " టైటిల్ నిర్ణయించినట్టు సమాచారం. హీరో రవితేజ బాడీ లాంగ్వేజ్ కు ఈ టైటిల్ యాప్ట్ అని చిత్ర యూనిట్ భావిస్తుంది.
నవంబర్ నుంచి రవితేజ, త్రినాథరావు కాంబినేషన్ మూవీ?
‘సినిమా చూపిస్త మావ’, ‘నేను లోకల్’, ‘హలో గురు ప్రేమకోసమే’.. ఇలా వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాడు దర్శకుడు త్రినాథరావు నక్కిన. కాగా, తన తదుపరి చిత్రాన్ని మాస్ మహారాజా రవితేజతో చేయబోతున్నట్టు గత కొంతకాలంగా కథనాలు వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది.