
ట్యాగ్ · 4 కథనాలు

బాబాయ్ , అబ్బాయ్ ల మల్టీ స్టారర్ ?
"విరాటపర్వం "సెట్స్ లో రానా దగ్గుబాటి

'విరాట పర్వం' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న సినిమా విరాట పర్వం. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది కానీ రిలీజ్ మాత్రం అవ్వలేదు. ఈసినిమా ఎన్నో సార్లు వాయిదా పడిన తరువాత ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నక్సలిజం నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుండగా రవన్న పాత్రలో రానా నటిస్తున్నాడు. ఇక ఫైనల్ గా ఈసినిమా జూన్ 17న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం వరుస అప్‌డేట్లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటికే వరుసగా పాటలు రిలీజ్ చేస్తుండగా.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. జూన్ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

'రానా' బర్త్ డే.. విరాటపర్వం నుండి స్పెషల్ వీడియో..!
వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి జంటగా రూపొందుతున్న సినిమా 'విరాటపర్వం'. నక్సలైట్ల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా కామ్రేడ్ 'రవన్న'గా కనిపించనున్నాడు. ఇక ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ ఇంత వరకూ రిలీజ్ కాలేదు. ఆమధ్య ఈసినిమా ఓటీటీలో రిలీజ్ అవుతున్నట్టు వార్తలు రాగా వాటిపై నిర్మాతలు కూడా స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఇక ఈసినిమా కు మిగిలి ఉన్న వర్క్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు.
బాబాయ్ , అబ్బాయ్ ల మల్టీ స్టారర్ ?
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాబాయ్ (వెంకటేష్ ), అబ్బాయ్ (రానా ) హీరోలుగా ఒక మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కనుందని సమాచారం. హీరో వెంకటేష్ పలు మల్టీ స్టారర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. మహేష్ బాబు తో "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు , నాగచైతన్య తో "వెంకీ మామ ", వరుణ్ తేజ్ తో "F 3 :ఫన్ &ఫ్రస్టేషన్" మల్టీ స్టారర్ మూవీస్ లో హీరో వెంకటేష్ నటించగా ఆ మూవీస్ ఘనవిజయం సాధించాయి. వెంకటేష్ , వరుణ్ తేజ్ ల "F 3"మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది.
"విరాటపర్వం "సెట్స్ లో రానా దగ్గుబాటి
సురేష్ ప్రొడక్షన్స్ , లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ "నీదీ నాదీ ఒకే కథ "మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా 1990 ల నాటి నక్సల్ మూవ్ మెంట్ నేపథ్యంలో వాస్తవ సంఘటనలతో "విరాట పర్వం " మూవీ రూపొందుతుంది. ప్రియమణి , నందితాదాస్ , జరీనావహాబ్ , ఈశ్వరీ రావు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. "విరాట పర్వం " మూవీ 90 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది.