
ట్యాగ్ · 4 కథనాలు


స్నేహితురాళ్ళు అయిన సీనియర్ హీరోయిన్స్ తో మీనా

సెకండ్ ఇన్నింగ్స్ కు రెడీ..!

రీ రిలీజ్‌కు సిద్ధమైన బాలకృష్ణ 'భైరవ ద్వీపం'
టాలీవుడ్‌లో రీసెంట్‌గా రీ రిలీజ్ ట్రెండ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఒకప్పుడు సూపర్ హిట్ అయిన అగ్ర హీరోల సినిమాలను మళ్ళీ విడుదల చేస్తూ లాభాలు గడిస్తున్నారు ఆయా చిత్రాల నిర్మాతలు. తాజాగా ఈ లిస్టులోకి నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ ‘భైరవ ద్వీపం’ సినిమా చేరింది. కాగా 1974లో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ.. సినీ పరిశ్రమలో 50 గ్లోరియస్ ఇయర్స్ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి, ఈ తరం ప్రేక్షకులను అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి 'భైరవ ద్వీపం' సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా.. ‘భైరవద్వీపం’ చిత్రాన్ని దాదాపు రెండు దశాబ్దాల…

ఎవర్ గ్రీన్ క్లాసిన్ భైరవద్వీపం రీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. రీ రిలీజ్ ల సందడి ఎక్కువైంది. స్టార్ హీరోల బర్త్ డేలకు.. స్పెషల్ అకేషన్స్ కు సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే పలు సినిమాలు రీ రిలీజ్ అయి సందడి చేశాయి. ఇక ఇప్పుడు మరో ఎవర్ గ్రీన్ క్లాసిక్ రీ రిలీజ్ కు సిద్దమైంది. ఆ సినిమా మరేదో కాదు బాలయ్య సినీ కెరీర్ లో ఎప్పటికీ గొప్ప సినిమాగా మిగిలిపోయే సినిమా భైరవద్వీపం.

స్నేహితురాళ్ళు అయిన సీనియర్ హీరోయిన్స్ తో మీనా
"నెంజంగళ్ "(1982 ) మూవీ తో కోలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన మీనా తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషల మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను అలరించారు. "నవయుగం "(1990 ) మూవీ తో మీనా టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. సూపర్ హిట్"సీతారామయ్య గారి మనవరాలు " మూవీ లో మీనా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో మీనా తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. అన్నిభాషల స్టార్ హీరోస్ కు జోడీగా నటించిన ఘనత మీనాదే.

సెకండ్ ఇన్నింగ్స్ కు రెడీ..!
ఒకప్పుడు స్టార్ హీరోల పక్కన స్టార్ హీరోయిన్లు గా వెండి తెరపై ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లు ఎంతోమంది సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసందే. హీరోయిన్లుగా కాదులే కానీ ఈ జనరేషన్ లో స్టార్ హీరోల పక్కన ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా రీఎంట్రీ ఇస్తున్నారు. ఏదో పాత్ర దక్కింది చేస్తున్నాం అన్నట్టు కాకుండా.. దర్శకులు కూడా ఏదో వారిని తీసుకోవాలి.. పాత్ర ఇవ్వాలి అన్నట్టు కాకుండా.. సినిమాకే వాళ్ళు కీలక పాత్రలుగా చేస్తున్నారు. వాళ్ళ ద్వారానే సినిమా నడిచే పాత్రలను సృష్టిస్తున్నారు. ఉదాహరణకు రమ్యకృష్ణ, నదియా, విజయశాంతి, మీనా అలా పలువురు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి కీలకపాత్రలతో అలరిస్తున్నారు.