
ట్యాగ్ · 4 కథనాలు


వెంకీ గారి ఆశీస్సులు తీసుకున్నా

'రాజ రాజ చోర' అన్ని భాషల్లో రీమేక్ చేస్తారు

"రాజ రాజ చోర " మూవీ టీమ్ కు రవితేజ అభినందనలు
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై హాసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు , మేఘ ఆకాష్ జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “రాజ రాజ చోర “మూవీ 19 వ తేదీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుని పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. సునైన , రవి బాబు , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. హీరో శ్రీవిష్ణు డిఫరెంట్ క్యారెక్టర్ లో మంచి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు.

'రాజ రాజ చోర' రివ్యూ
పాటలు సంగతి పక్కన పెడితే వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ మ్యాజిక్ మాత్రం ఆకట్టుకుంటుంది. వేద రామన్ సినిమాటోగ్రఫీ, సినిమా నిర్మాణ విలువలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇక ఫైనల్ గా కామెడీ చిత్రాలను మన ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు.. ఇక ఈసినిమా కూడా బాగానే ఆకట్టుకుంటుంది అని చెప్పొచ్చు.

వెంకీ గారి ఆశీస్సులు తీసుకున్నా
హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు రాజ రాజ చోర అనే సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఈనెల 19న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా శ్రీ విష్ణు స్పీడు పెంచాడు. నిజానికి ఇప్పటివరకూ తన సినిమాల గురించి ఎప్పుడూ మాట్లాడనంతగా ఈసినిమా గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడాడు శ్రీ విష్ణు. అంతేకాదు వెంకీ నారప్ప గురించి కూడా మాట్లాడిన సంగతి తెలిసిందే కదా. 'విక్టరీ వెంకటేష్ గారికి నేను వీరాభిమానిని. నారప్ప చిత్రం ఓటిటిలో రిలీజ్ కావడం బాధగా అనిపించింది. రెండు రోజుల పాటు భోజనం కూడా చేయలేదు. సూపర్ స్టార్స్ నటించే చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ కావాలంటే ముందుగా చిన్న చిత్రాలకు…

'రాజ రాజ చోర' అన్ని భాషల్లో రీమేక్ చేస్తారు
శ్రీ విష్ణు సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. మొదటి నుండి కాస్త వైవిధ్యంగా ఉన్న సినిమాలనే తను ఎంచుకుంటాడు. అందుకే ప్రేక్షకులకు కూడా శ్రీవిష్ణు సినిమాలంటే ఏదో ఒక డిఫరెంట్ ఉంటుందని చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక ఇప్పుడు రాజ రాజ చోర అనే సినిమాతో వస్తున్నాడు. ఈసినిమా ఈనెల 19న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈనేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఇక ఈసందర్బంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.