
ట్యాగ్ · 5 కథనాలు


ప్రభాస్ సక్సెస్ కు అదే కారణం..!

'సలార్' పై పృథ్వీరాజ్ క్లారిటీ..!

'కె.జి.యఫ్' కు రెండింతలు 'సలార్'..!

'సలార్'.. జగపతిబాబు లుక్ రిలీజ్

సలార్ రెండు రోజుల్లో అప్ డేట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక దీనితో పాటు సలార్ సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది కానీ మధ్యలో కరోనా వల్ల ఈసినిమా షూట్ కు బ్రేక్ పడింది. ఇక మొత్తానికి మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టి కంప్లీట్ చేస్తున్నారు.

ప్రభాస్ సక్సెస్ కు అదే కారణం..!
ఈశ్వర్ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ప్రభాస్ హీరోగా నిలదొక్కుకొని ఆ తరువాత స్టార్ హీరోగా.. స్టార్ హీరో నుండి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు ప్రభాస్. ఈ స్థాయికి రావడానికి ప్రభాస్ కూడా ఎంత కష్టపడ్డాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అయితే పాన్ ఇండియా స్టార్ గా పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక ప్రభాస్ తన సహనటులతో, చిత్రయూనిట్ తో ఎలా ఉంటాడో కూడా పలు సందర్భాల్లో చాలా మంది చెప్పటం చూశాం. తనతో పనిచేసిన ప్రతిఒక్కరూ తనపై ప్రశంసలు కురిపించకుండా ఉండలేరు. అందుకే అందరికీ డార్లింగ్ అయ్యాడు ప్రభాస్. ఇక ఇప్పుడు అవార్డ్ విన్నింగ్ సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి కూడా ప్రభాస్ పై…

'సలార్' పై పృథ్వీరాజ్ క్లారిటీ..!
ప్రస్తుతం వస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ ఒకటి. ఈసినిమాను కూడా యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్ టైన్ మెంట్ గా తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇక ఈసినిమా ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. మధ్యలో కొంత బ్రేక్ పడినా ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది.

'కె.జి.యఫ్' కు రెండింతలు 'సలార్'..!
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా సలార్. ఈ సినిమాకోసం ప్రభాస్ అభిమానులు ఎంతోఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో అవ్వడం.. అలానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కె.జి.యప్ 2 రీసెంట్ గా రిలీజ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈసినిమాలో ప్రభాస్ పాత్ర గురించి వార్తలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఈసినిమా లో ప్రభాస్ వయోలెంట్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.

'సలార్'.. జగపతిబాబు లుక్ రిలీజ్
ఒకప్పుడు ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న జగపతి బాబు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా పవర్ ఫుల్ పాత్రలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. పెద్ద పెద్ద సినిమాల్లో కీలక పాత్రలకు సైతం జగపతిబాబే కేరాఫ్ అడ్రస్ అవుతున్నాడు. ఇప్పటికే జగ్గూభాయ్ లిస్ట్ లో పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. వీటిలో ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమా కూడా ఒకటి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.