
ట్యాగ్ · 24 కథనాలు · పేజీ 2


వరస మూవీస్ తో పవన్ కళ్యాణ్ బిజీ

షూట్ కు రెడీ అవుతున్న 'పవన్'

'పవన్' కోసం పోలీస్ స్టేషన్ సెట్

పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్ అప్ డేట్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కే హంగామా చేసే అభిమానులు బర్త్ డే (SEP 2 వ తేదీ )సందర్భంగా పెద్ద ఎత్తున హంగామా చేస్తున్నారు. పవన్ పేరుతో సేవా కార్యక్రమాలు అలానే కేక్ కటింగ్‌లు భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి తమ ప్రేమను తెలియజేస్తున్నారు. "వకీల్ సాబ్" చిత్రంతో వెండితెరకు రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పవన్ "భీమ్లా నాయక్"మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు . ఈ మూవీ తో పాటు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న"హరిహర వీరమల్లు" మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్ , సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మూవీస్ కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

వరస మూవీస్ తో పవన్ కళ్యాణ్ బిజీ
దాదాపు 3 సంవత్సరాలు గ్యాప్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ " మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ లాయర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. వరస మూవీ కమిట్ మెంట్స్ తో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో పీరియాడికల్ మూవీ “హరిహర వీరమల్లు “ లో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ , నిధి అగర్వాల్ కథానాయికలు. “హరిహర వీరమల్లు “ మూవీ 2022 సంవత్సరం జనవరి లో రిలీజ్ కానుంది.

షూట్ కు రెడీ అవుతున్న 'పవన్'
ఇన్ని రోజులు కరోనా వల్ల రెస్ట్ తీసుకున్న తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సెట్స్ పైకి సందడి చేయడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ చేతిలో పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో రానా-పవన్ కాంబినేషన్ లో వస్తున్న మలయాళం సినిమా అయ్యప్పనుమ్ కోషియనుమ్ రీమేక్ కాగా మరొకటి క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా. ఈరెండు సినిమాలు షూటింగ్ దశలోనే ఉండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ లకు బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు మళ్లీ అందరూ షూటింగ్ లు స్టార్ట్ చేస్తున్న నేపథ్యంలో పవన్ కూడా రెడీ అవుతున్నాడు.

'పవన్' కోసం పోలీస్ స్టేషన్ సెట్
సాగరచంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్ప నుమ్ కోషియనుమ్ సినిమా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ మొదలవ్వగా పలు కీలక సన్నివేశాలను కూడా చీత్రీకరించారు. ఇక ఈసినిమా షూటింగ్ లో ఉన్నప్పుడే కరోనా సేకండ్ వేవ్ ఊపందుకోవడంతో షూట్ కు బ్రేక్ పడింది. ఇక కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో షూటింగ్ లు ఆరంభమవుతున్నాయి దీనిలో భాగంగానే ఈ సినిమా షూటింగ్ ని ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.