
ట్యాగ్ · 5 కథనాలు


స్పెషల్ డే కి ఒక్కడు రీ రిలీజ్

బ్లాక్ బస్టర్ ఒక్కడు మూవీ రీ రిలీజ్ డేట్
"ఒక్కడు" మూవీ సీక్వెల్ ?

ఒక నెల గ్యాప్‌లో ఏకంగా 6 సినిమాలు రీ-రిలీజ్
టాలీవుడ్‌లో గత కొంతకాలంగా రీ-రిలీజ్‍ల ట్రెండ్ నడుస్తోంది. గతంలో సూపర్ హిట్ అయిన అగ్ర హీరోల సినిమాలు మళ్లీ థియేటర్లలోకి వస్తున్నాయి. కొన్ని ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని మేకర్స్ వాటిని రీ-రిలీజ్ చేస్తున్నారు. అయితే రీ-రిలీజ్‍లకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఎప్పుడో తమ చిన్నతనంలో చూసిన తమ ఫెవరేట్ హీరోల చిత్రాలను మళ్ళీ మరోసారి థియేటర్లలో చూసేందుకు వారు చాలా ఆసక్తిని కనబరుస్తున్నారు. దీంతో మేకర్స్ కూడా స్టార్ హీరోల హిట్ సినిమాలను రీ-రిలీజ్ చేసేందుకు ముందుకొస్తున్నారు.

మహేష్ బాబు ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఒక్కడు స్పెషల్ షోస్
రీసెంట్‌గా టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఒకప్పుడు సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను మళ్ళీ థియేటర్లలో విడుదల చేస్తున్నారు ఆయా చిత్రాల నిర్మాతలు. తాజాగా ఈ లిస్టులోకి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఒకటి చేరింది. ఆయన హీరోగా నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఒక్కడు’ ప్రస్తుతం రీ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2003లో విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

స్పెషల్ డే కి ఒక్కడు రీ రిలీజ్
ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలు రీ రిలీజ్ అయి సందడి చేశాయి. ఇక రెండు రోజుల క్రితమే.. తలైవా రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా బాబా సినిమా కూడా రీరిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కూడా ఒకటి రీ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే మహేష్ పుట్టినరోజు సందర్భంగా పోకిరి సినిమాను రీరిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో కూడా ఈసినిమా రికార్డ్ కలెక్షన్స్ ను క్రియేట్ చేసింది. ఇప్పుడు మహేష్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా ఒక్కడు ను కూడా రీ రిలీజ్ చేయనున్నారు.

బ్లాక్ బస్టర్ ఒక్కడు మూవీ రీ రిలీజ్ డేట్
సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు ,భూమిక జంటగా భారీ బడ్జెట్ , సెట్స్ తో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ఒక్కడు మూవీ 2003 జనవరి 15 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. మహేష్ బాబు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఈ మూవీ 8 నంది , 4 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకుంది. “ఒక్కడు ” మూవీ తమిళ , కన్నడ , బెంగాలీ , హిందీ , ఒడియా , సింహళ భాషలలో రీమేక్ అయ్యి విజయం సాధించింది.ఈ మూవీ కై స్పెషల్ గా చార్మినార్ సెట్ ను రూపొందించడం విశేషం.
"ఒక్కడు" మూవీ సీక్వెల్ ?
సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు,భూమిక జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఒక్కడు "మూవీ ఘనవిజయం సాధించి మహేష్ బాబు సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 8 నందిఅవార్డ్స్ ,4 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్న"ఒక్కడు" మూవీ కన్నడ , తమిళ , బెంగాలీ , హిందీ భాషలలో రీమేక్ జరుపుకుని ఘనవిజయం సాధించింది. చార్మినార్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన "ఒక్కడు" మూవీ కై భారీ వ్యయం తో చార్మినార్ సెట్ ను రూపొందించడం విశేషం. మణిశర్మ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.