
ట్యాగ్ · 5 కథనాలు

'ఓదెల రైల్వేస్టేషన్' సెకండ్ షెడ్యూల్ స్టార్ట్

మహా కుంభమేళా వేదికగా.. ఓదెల 2 టీజర్ రిలీజ్
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రధానపాత్రలో నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల 2’. ఇది 2021లో హిట్ అయిన ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్‌గా వస్తోంది. అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్స్ పై నిర్మాత డి మధు నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.
ఓదెల రైల్వేస్టేషన్' - హెబ్బా ఫస్ట్‌లుక్ రిలీజ్
దీపావళి పండుగ సందర్భంగా పలు సినిమాల అప్ డేట్స్ వచ్చేసాయి. ఫస్ట్ లుక్స్, టీజర్స్, ట్రైలర్స్ లను విడుదల చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తున్నారు. దీనిలో భాగంగానే 'ఓదెల రైల్వేస్టేషన్' సినిమా నుండి కూడా అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో హెబ్బా పటేల్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పండుగ సందర్భంగా హెబ్బా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఫస్ట్ లుక్ ను చూస్తుంటే ఇందులో పల్లెటూరి అమ్మాయి రాధ అనే పాత్రలో హెబ్బా నటిస్తున్నట్టు తెలుస్తుంది. డీ గ్లామర్ రోల్ లో ఆమె లుక్ ఆకట్టుకుంటుంది.
ఓదెల రైల్వేస్టేషన్ - రేపే ఫస్ట్ లుక్
అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ఓదెల రైల్వేస్టేషన్'. ఈ సినిమాకు సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్ వంటి సూపర్‌హిట్స్ అందించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ ప్రొడక్షన్ నెం.9గా ఈ సినిమా రూపొందనుంది. మొదటి షెడ్యూల్ పూర్తిచేసిన చిత్ర యూనిట్ ఇటీవలే రెండో షెడ్యూల్ ను స్టార్ట్ చేసింది. సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే కొన్ని సీన్లను ఓదెల ర్వైల్వేస్టేషన్లో చిత్రీకరించగా మరికొన్ని సన్నివేశాలను ఓదెల మండలంలో తెరకెక్కించారు. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే హైదరాబాద్‌లో…
'ఓదెల రైల్వేస్టేషన్' సెకండ్ షెడ్యూల్ స్టార్ట్
అశోక్ తేజ దర్శకుడిగా.. సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా 'ఓదెల రైల్వేస్టేషన్'. ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్ వంటి సూపర్‌హిట్స్ అందించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ ప్రొడక్షన్ నెం.9గా ఈ సినిమా రూపొందనుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మొదటి షెడ్యూల్ పూర్తిచేసింది చిత్ర యూనిట్.మొదటి షెడ్యూల్లో కొన్ని సీన్లను ఓదెల ర్వైల్వేస్టేషన్లో చిత్రీకరించగా మరికొన్ని సన్నివేశాలను ఓదెల మండలంలో తెరకెక్కించారట.
సొంత ఊరి గురించి సంపత్ నంది - ప్రకృతికి ఏది సరితూగదు
అశోక్ తేజ దర్శకుడిగా పరిచయమవుతూ.. సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ తెరకెక్కుతున్న థ్రిల్లర్ సినిమా 'ఓదెల రైల్వేస్టేషన్'. కన్నడలో 25 చిత్రాలకు పైగా నటించిన వశిష్ట సింహ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్నాడు. ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా ఒక వైవిద్యమైన పాత్రలో హీరోయిన్ హెభా పటేల్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు డీ గ్లామర్ పాత్రలో నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు కూడా చిత్రయూనిట్. ప్రస్తుతం తెలంగాణలోని ఓదెల ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటుంది.