
ట్యాగ్ · 44 కథనాలు · పేజీ 3


సరిపోదా శనివారం.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

యాక్షన్ ఎపిసోడ్ తో సరిపోదా శనివారం షూట్ షురూ

సరిపోదా శనివారం నుండి వచ్చే శనివారం స్పెషల్ ట్రీట్
గత ఏడాది రెండు సినిమాలతో అలరించిన నాని ప్రస్తుతం కొత్త సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా రాబోతున్న సినిమా సరిపోదా శనివారం ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న రెండో సినిమా ఇది. ఈసినిమాలో నాని కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో అలరించనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈసినిమా టైటిల్ తో పాటు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది.

సరిపోదా శనివారం.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
నేచురల్ స్టార్ నాని 'హాయ్ నాన్న' తర్వాత హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'సరిపోదా శనివారం'. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్‌లో 'అంటే సుందరానికి' సినిమా వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రంతో మరోసారి వీరి కాంబో రిపీట్ కానుంది. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కోలీవుడ్ డైరెక్టర్ కమ్ హీరో ఎస్‌జే సూర్య విలన్‌గా కనిపించనున్నాడు. 'ఆర్ఆర్ఆర్' వంటి పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించిన డీవీవీ దానయ్య డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దీనిని తెరకెక్కిస్తున్నారు.

సరిపోదా శనివారం ఓటిటి డీల్ క్లోజ్
న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు పూర్తి కావొచ్చింది.ఇంకా 30శాతం కూడా షూటింగ్ పూర్తి కాలేదు కానీ బిజినెస్ మాత్రం యమ స్పీడ్ గా జరుగుతుంది.ఈసినిమా థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు,శిరీష్ దక్కించుకున్నారు.నైజాంతోపాటు ఆంధ్రాకు గాను ఈ హక్కులను సొంతం చేసుకున్నారు.భారీ మొత్తానికి ఈడీల్ కుదిరిందట.ఇక ఇప్పుడు ఓటిటి రైట్స్ కూడా అమ్ముడయ్యాయి.

యాక్షన్ ఎపిసోడ్ తో సరిపోదా శనివారం షూట్ షురూ
న్యాచురల్ స్టార్ నాని మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ప్రధమార్థంలో దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకోగా.. ఇప్పుడు ఏడాది చివరిలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శౌర్యువ్ దర్శకత్వంలో నాని హీరోగా రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా హాయ్ నాన్న. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా ఈసినిమా రాబోతుంది. ఇక ఈసినిమా డిసెంబర్ 7వ తేదీన రిలీజ్ కానుంది