
ట్యాగ్ · 4 కథనాలు


మాస్ పోలీస్ , ఫ్యాక్షనిస్ట్ గా బాలకృష్ణ
పవర్ ఫుల్ టైటిల్ తో బాలకృష్ణ
మరోసారి బాలయ్యతో..!

బాలకృష్ణ-గోపీచంద్ మలినేని మూవీ షూటింగ్ ప్రారంభం..!
యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అగ్రహీరోలు కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి లిస్ట్ లో నాలుగైదు సినిమాలు ఉండగా మరో వైపు నాగార్జున, వెంకీ కూడా పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక బాలకృష్ణ కూడా రీసెంట్ గా అఖండతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకొని ఇప్పుడు అదే జోష్ తో మరో సినిమాను కూడా ప్రారంభించేశాడు. గోపీచంద్ మలినేని-బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి ఎప్పుడో తెలిసిందే కదా.

మాస్ పోలీస్ , ఫ్యాక్షనిస్ట్ గా బాలకృష్ణ
హీరో బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ "అఖండ "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. "అఖండ" మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ , టీజర్ లకు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది. "అఖండ "మూవీ తరువాత మలినేని గోపీచంద్ దర్శకత్వంలో రూపొందే ఒక మూవీ కి హీరో బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
పవర్ ఫుల్ టైటిల్ తో బాలకృష్ణ
"తాతమ్మ కల "(1974 ) మూవీ తో కెరీర్ ప్రారంభించిన బాలకృష్ణ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. పవర్ ఫుల్ క్యారెక్టర్స్ కు పెట్టింది పేరైన బాలకృష్ణ "నరసింహ నాయుడు ", "సింహా ", శ్రీరామ రాజ్యం ', "గౌతమి పుత్ర శాతకర్ణి ", "మువ్వగోపాలుడు ","ఆదిత్య 369"వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా అవార్డ్స్ అందుకున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న "BB3 " మూవీ లో నటిస్తున్నారు.
మరోసారి బాలయ్యతో..!
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ 'సింహా', 'లెజెండ్' తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా..సెకండ్ షెడ్యూల్ ను ఏప్రిల్ నుండి మొదలుపెట్టనున్నారు. కరోనా కారణంగా కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చారు. ఏప్రిల్ నుండి మరో షెడ్యూల్ ను ప్రారంభించనున్నారు.