
ట్యాగ్ · 4 కథనాలు


#NS23 నుండి క్రేజీ అప్ డేట్
"లక్ష్య "మూవీ అప్ డేట్
అనుష్కతో పోటీ పడుతున్న నాగశౌర్య

బిజీ యంగ్ హీరో నాగశౌర్య
హీరో నాగశౌర్య వరస మూవీ కమిట్ మెంట్స్ తో టాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. స్వంత బ్యానర్ తో పాటు ఇతర బ్యానర్స్ లోనూ నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్నారు. హీరో నాగశౌర్య ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా "లక్ష్య " మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లోని క్యారెక్టర్ కై నాగశౌర్య 8 ప్యాక్ అబ్స్ సాధించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా "వరుడు కావలెను "మూవీ తెరకెక్కుతుంది.

#NS23 నుండి క్రేజీ అప్ డేట్
నేటి తరం హీరోల్లో నాగ శౌర్య తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుని వైవిధ్యమైన నటనను కనబరుస్తూ కెరీర్ లో ముందుకు వెళ్తున్నాడు. ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద, కళ్యాణ్ వైభోగమే,ఛలో, అశ్వద్ధామ ఇలా పలు సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు నాగశౌర్య.
"లక్ష్య "మూవీ అప్ డేట్
యంగ్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా మూడు సినిమాలు రూపొందుతున్న విషయం తెలిసిందే. "లక్ష్య ", "వరుడు కావలెను " మూవీస్ షూటింగ్స్ తో బిజీగా ఉన్న హీరో నాగశౌర్య , అనీష్ కృష్ణ దర్శకత్వంలో "#NS22 " మూవీ ను పూజాకార్యక్రమం తో ప్రారంభించారు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో విలు విద్య నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య ” మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో “రొమాంటిక్ “మూవీ ఫేమ్ కేతిక శర్మ కథానాయిక కాగా జగపతి బాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు . కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.
అనుష్కతో పోటీ పడుతున్న నాగశౌర్య
వచ్చే ఏడాది జనవరి 31న ఆసక్తికరమైన పోటీ నెలకొంటోంది. ఎందుకంటే... అదే రోజున రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాయి. ఆ చిత్రాలే... `నిశ్శబ్దం`, `అశ్వథ్థామ`.