
ట్యాగ్ · 4 కథనాలు

40 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న నాగచైతన్య `లవ్ స్టోరీ`
ఈ ఏడాది వేసవిలో విడుదలైన రొమాంటిక్ ఎంటర్ టైనర్ `మజిలీ`తో కెరీర్ బెస్ట్ హిట్ ని అందుకున్నాడు యువ సామ్రాట్ నాగచైతన్య. కట్ చేస్తే... వచ్చే సంవత్సరం వేసవిలో మరో రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో పలకరించబోతున్నాడీ టాలెంటెడ్ స్టార్. `లవ్ స్టోరీ` అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ చిత్రంలో చైతూకి జోడీగా డాన్సింగ్ సెన్సేషన్ సాయిపల్లవి నటిస్తుండగా... ఫీల్ గుడ్ మూవీస్ స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు.
నాగచైతన్యకి `థమన్ ఫ్యాక్టర్` మరోసారి కలిసొస్తుందా?
తన మేనమామ విక్టరీ వెంకటేష్ తో యువ సామ్రాట్ నాగచైతన్య నటించిన చిత్రం `వెంకీమామ`. ఇందులో నిజజీవిత పాత్రల్లోనే ఈ మామాఅల్లుళ్ళు సందడి చేయనున్నారు. వెంకీ బర్త్ డే స్పెషల్ గా రేపు (డిసెంబర్ 13) ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.

ఫైనల్లీ చైతు తో 'గీత గోవిందం' డైరెక్టర్..!
విజయ్ దేవరకొండ హీరోగా కన్నడ బూటీ కథానాయికగా పరుశురాం దర్శకత్వంలో తెలుగులో తెరకెక్కిన చిత్రం గీత గోవిందం. ‘గీతా గోవిందం’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన పరుశురాం.. ఆ సినిమా విడుదలై ఏడాది దాటినా కొత్త సినిమాను మాత్రం ఇంతవరకూ ప్రకటించలేదు. అయితే మొదట పరుశురాం మహేష్ తో సినిమా చేస్తున్నాడన్నారు కానీ అది వర్క్ అవుట్ కాలేదు. ఆ తర్వాత కూడా ఆ హీరో చేస్తున్నాడు..ఈ హీరో తో చేస్తున్నాడు అన్నారు కానీ అవన్నీ వార్తలు గానే మిగిలాయి తప్ప ఇంతవరకూ క్లారిటీ రాలేదు. అయితే తాజాగా ఒక వార్త వినిపిస్తుంది.
హీరో నాగచైతన్య "లవ్ స్టోరీ "
అమిగోస్ క్రియేషన్స్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర మూవీస్ బ్యానర్ పై ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం లో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ కి లవ్ స్టోరీ టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. పవన్ సంగీతం అందించారు. లవ్ స్టోరీ మూవీ ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 వ తేదీ రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు.