
ట్యాగ్ · 7 కథనాలు


మట్కా సెన్సార్ టాక్

మట్కా షూటింగ్ అప్‌డేట్

మట్కా షూటింగ్ అండర్ ప్రోగ్రెస్

మట్కా-బ్యాక్ టు సెట్స్

మట్కా విషయంలో క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు

మట్కా కోసం టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్

రివ్యూ: మట్కా
ఇక ఆర్ట్ డిపార్ట్ మెంట్ పడ్డ కష్టం తెరపై కనిపిస్తుంది. 1960ల నాటి కాలాన్ని చాలా చక్కగా ఆవిష్కరించింది టీమ్. అలాగే చిత్ర నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉంది. సినిమాలో సెట్టింగ్స్ చూస్తుంటే నిర్మాతలు ఎక్కడా ఖర్చుకు వెనుకాడలేదని అర్ధమవుతోంది.

మట్కా సెన్సార్ టాక్
వరుణ్ తేజ్ మట్కా ఈనెల 14న థియేటర్లోకి రానుంది.ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఈసినిమాకు సెన్సార్ వాళ్ళు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారట. ఈమధ్య కాలంలో ఇలాంటి సినిమా రాలేదని నిర్మాణ విలువలు బాగున్నాయని వరుణ్ నటన ,కరుణ కుమార్ డైరెక్షన్ మెచ్చుకున్నారట. సినిమాలో చివరి 20నిమిషాలు హైలైట్ అవ్వనుందట.సినిమా విజయంపై మట్కా టీం కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా వుంది.ఈసినిమాకు యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. 2 గంటల 33నిమిషాల రన్ టైం తో థియేటర్లలోకి రానుంది.ఇందులో వరుణ్ డిఫ్రెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు.

మట్కా షూటింగ్ అప్డేట్
మెగా హీరో వరుణ్ తేజ్,పలాస ఫేమ్ కరుణ కుమార్ కాంబోలో వస్తున్న చిత్రం మట్కా.1980 బ్యాక్ డ్రాప్ తో వస్తుంది.ఇందులో వరుణ్ డాన్ పాత్రలో కనిపించనున్నాడు.ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ కాకినాడ లో జరుగుతుంది.ఈసందర్భంగా మేకర్స్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఈషెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.వరుణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈసినిమా.

మట్కా షూటింగ్ అండర్ ప్రోగ్రెస్
ఈ ఏడాది వరుణ్ తేజ్ వాలంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే ఆసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. కరుణ్ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా మట్కా. యధార్థ సంఘటనల ఆధారంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి ఓపెనింగ్ బ్రాకెట్ అంటూ ఒక గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేయగా.. నిమిషమున్నర నిడివి ఉన్న ఈ గ్లింప్స్ ఆకట్టుకుంది.

మట్కా-బ్యాక్ టు సెట్స్
మెగా కాంపౌండ్ నుండి వచ్చి తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. అయితే ఈసినిమా మంచి విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయాడు.

మట్కా విషయంలో క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు
మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న మట్కా బడ్జెట్ కారణాల వల్ల ఆగిపోయిందని ఇటీవల వార్తలు వచ్చాయి. వరుణ్ మార్కెట్ కన్నా సినిమా బడ్జెట్ ఎక్కువవుతుందని అందుకే ఆగిపోయిదంటూ ప్రచారం జరిగింది.అయితే ఈవిషయం లో నిర్మాతలు తాజాగా క్లారిటీ ఇచ్చారు.ఈసినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ని తీసుకున్నారు.ఈరోజు ఆమె బర్త్ డే సందర్బంగా మట్కా నుండి పోస్టర్ రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ చెప్పారు దాంతో సినిమా ఆగిపోయిందని వచ్చిన వార్తలకు చెక్ పెట్టినట్లైయింది.

మట్కా కోసం టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈమధ్యనే గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ప్రస్తుతం అయితే పలు సినిమాలు లిస్ట్ లో ఉన్నాయి. ఇప్పటికే ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తున్న ఈసినిమాలో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్ గా నటిస్తున్నాడు. ఈసినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ కానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు.