ట్యాగ్ · 5 కథనాలు

రవితేజ కోసం డైరెక్టర్ల పోటీ

`కనకదుర్గ`గా రవితేజ?

రవితేజ నెక్ట్స్ ప్రాజెక్ట్ అప్‌డేట్
రిపీట్ మోడ్ లో రవితేజ రొమాన్స్
గత చిత్రం `డిస్కో రాజా`లో ముచ్చటగా ముగ్గురు కథానాయికలతో సందడి చేశాడు మాస్ మహారాజా రవితేజ. పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తాన్యా హోప్.. ఇలా ఇదివరకు తను జోడీకట్టని భామలతోనే ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశాడాయన. కట్ చేస్తే.. రాబోయే చిత్రాల్లో మాత్రం అందుకు భిన్నంగా ఆల్రెడీ తను జట్టుకట్టిన నాయికలతోనే `రిపీట్` రొమాన్స్ చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు రవితేజ.
క్రేజీ హీరోయిన్స్ రీ-ఎంట్రీకి కేరాఫ్ అడ్రస్ గా మాస్ మహారాజా
`కాటమరాయుడు` (2017) తరువాత టాలీవుడ్ కి దూరమైన శ్రుతి హాసన్... మాస్ మహారాజా రవితేజ `క్రాక్`తో రీ-ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. `బలుపు` వంటి విజయవంతమైన చిత్రం తరువాత తన లక్కీ హీరో (రవితేజ) కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో... శ్రుతి ఈ కాప్ స్టోరీపై భారీ ఆశలే పెట్టుకుంది.

రవితేజ కోసం డైరెక్టర్ల పోటీ
మాస్ రాజా రవితేజ, వి.ఐ ఆనంద్ కాంబినేషన్ లో ‘డిస్కోరాజా’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ మొత్తం కంప్లీట్ చేసుకుని షూటింగ్ కి రెడీగా ఉంది. ఇక ఎప్పుడో స్టార్ట్ కావాల్సిన షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు ఇబ్బందుల్లో పడినట్టు తెలుస్తోంది. దీనికి కారణం బడ్జెట్ ఎక్కువ కావడమేనట. దీంతో షూటింగ్ ఆగిపోయిందని అంటున్నారు.

`కనకదుర్గ`గా రవితేజ?
మూడేళ్ళ క్రితం వేసవి కానుకగా విడుదలైన కాప్ స్టోరీ `తెరి`... తమిళనాట వసూళ్ళ వర్షం కురిపించింది. విజయ్, సమంత, అమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో అట్లీ రూపొందించిన ఈ చిత్రం... ఇప్పుడు తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా `కందిరీగ` ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఒరిజినల్ వెర్షన్‌లోని థీమ్‌ని మాత్రమే తీసుకుని... భారీ మార్పులు చేర్పులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు సంతోష్. ఏప్రిల్ 15 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం…

రవితేజ నెక్ట్స్ ప్రాజెక్ట్ అప్‌డేట్
మాస్ రాజా రవితేజ ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. `ఎక్కడికి పోతావు చిన్నవాడా` ఫేమ్ వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాని `నేల టిక్కెట్టు` ఫేమ్ రామ్ తాళ్ళూరి నిర్మించనున్నారు. డిస్కో బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ పిరియాడిక్ మూవీకి `డిస్కో రాజా` అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇదిలా ఉంటే... డిసెంబర్‌లో సెట్స్ పైకి వెళ్ళాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం... ఈ సినిమాని రవితేజ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ నెల 26న లాంఛనంగా ప్రారంభించనున్నట్లు టాలీవుడ్ టాక్. అలాగే... ఈ చిత్రంలో రవితేజకి జోడీగా `ఆర్ ఎక్స్…