
ట్యాగ్ · 7 కథనాలు


విశ్వక్ సేన్ VS13 గ్రాండ్‌గా లాంచ్

విశ్వక్ సేన్ గ్రేట్ డెసిషన్, సర్వత్రా ప్రశంసలు

VS11 రా అండ్ రగ్డ్ సెకండ్ షెడ్యూల్ కంప్లీట్

విశ్వక్ సేన్ ధమ్కీ మూవీ రిలీజ్ డేట్

విశ్వక్ ధమ్కీ ఫస్ట్ లుక్ రిలీజ్

దేవర హ్యాంగోవర్ దిగడానికి మంచి రిఫ్రెష్మెంట్ సత్యం సుందరం
ప్రముఖ తమిళ స్టార్ హీరో కార్తీ, సీనియర్ నటుడు అరవింద్ స్వామి లీడ్ రోల్స్‌లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ 'సత్యం సుందరం'. '96' ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

విశ్వక్ సేన్ VS13 గ్రాండ్‌గా లాంచ్
టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ #VS13. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్ ప్రొడక్షన్ నెం. 8గా ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఎవ్రీ యాక్షన్ ఫైర్స్ ఎ రియాక్షన్ అనేది సినిమా ట్యాగ్‌లైన్. ఇటీవల విశ్వక్ ని ఫెరోషియస్ పోలీసుగా ప్రజెంట్ చేసిన ప్రీ-లుక్ పోస్టర్ ద్వారా ఈ మూవీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. డెబ్యుటెంట్ శ్రీధర్ గంటా రచన, దర్శకత్వం వహిస్తున్న #VS13లో విశ్వక్ సేన్ హానెస్ట్ IPS ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.

డార్లింగ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్‌గా విశ్వక్ సేన్
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి క్యామియో రోల్స్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనంతరం హీరో స్థాయికి అడిగాడు. ప్రముఖ తెలంగాణ చేనేత కళాకారుడు చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మల్లేశం' సినిమాతో తనలో అద్భుతమైన నటుడు ఉన్నాడని నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో ప్రియదర్శి ప్రధానపాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'డార్లింగ్'. 'వై దిస్ కొలవరి?' అనేది టాగ్ లైన్‌గా ఉంది.

విశ్వక్ సేన్ గ్రేట్ డెసిషన్, సర్వత్రా ప్రశంసలు
టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటివలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలావుండగా.. విశ్వక్ సేన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అవయవదానం చేయడానికి ముందుకొచ్చారు. తాజాగా ఆయన 'మెట్రో రెట్రో' అనే నోబుల్ కాజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అవయవదానం (ఆర్గాన్ డొనేషన్)కు సపోర్ట్ చేయడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో హీరో విశ్వక్ సేన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వక్ తన ఆర్గాన్స్ డొనేట్ చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

VS11 రా అండ్ రగ్డ్ సెకండ్ షెడ్యూల్ కంప్లీట్
డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస అవకాశాలను దక్కించుకుంటున్నాడు. ఇప్పటికే వరుసగా అర్జున కళ్యాణం, ఓరి దేవుడా, ధమ్కీ సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. రీసెంట్ గానే రిలీజ్ అయిన ధమ్కీ సూపర్ హిట్ అవ్వడంతో పాటు మంచి కలెక్షన్స్ ను కూడా రాబట్టుకుంటుంది. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమా షూటింగ్ తో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు విశ్వక్ సేన్. ఇది తన కెరీర్ లో వస్తున్న 11వ సినిమా కావడంతో VS11 అనే వర్కింగ్ టైటిల్ తోనే ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా…

విశ్వక్ సేన్ ధమ్కీ మూవీ రిలీజ్ డేట్
వెళ్ళి పోమాకే మూవీ తో హీరోగా పరిచయం అయిన విశ్వక్ సేన్ ఈ నగరానికి ఏమైంది ?, HIT :ది ఫస్ట్ కేస్ , అశోకవనం లో అర్జునకల్యాణం , ఓరి దేవుడా! వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో ప్రేక్షకులనుఅలరించారు. ఫలక్ నుమా దాస్ మూవీ తో దర్శకుడు గా మారిన విశ్వక్ సేన్ ఇప్పుడు స్వీయ దర్శకత్వంలో మరో మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

విశ్వక్ ధమ్కీ ఫస్ట్ లుక్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వైవిద్యమైన సినిమాలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. విశ్వక్ సేన్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈఏడాది ఇప్పటికే అశోక వనంలో అర్జున కళ్యాణం రీసెంట్ గా ఓరి దేవుడా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈరెండు సినిమాలు కూడా డీసెంట్ హిట్ ను అందించాయి. ఇక ఇప్పుడు తన కొత్త సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒక సినిమానే ధమ్కీ. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను ముగించే పనిలో ఉన్నారు.