
ట్యాగ్ · 4 కథనాలు


"మేజర్"మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్

తక్కువ రేటుకే 'మేజర్' టికెట్లు

మారిన 'మేజర్' రిలీజ్ డేట్..!

"మేజర్" మూవీపై మహేష్ బాబు స్పందన
సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా “మేజర్” మూవీ 3 వ తేదీ రిలీజ్అయ్యి ప్రేక్షక , విమర్శకుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివిశేష్ తన కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అందించారు. అడివి శేష్ కు జోడీగా నటించిన సయీ మంజ్రేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అడివి శేష్ , సయీ ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.USA లో…

"మేజర్"మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్
సూపర్ హిట్ “గూఢచారి “, “ఎవరు” మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన అడివి శేష్ “మేజర్ “మూవీతో అలరించనున్నారు.సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన “మేజర్” మూవీ జూన్ 3వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో అడివి శేష్ కు జోడీగా సాయీ మంజ్రేకర్ నటించారు. ఈ మూవీ లో శోభిత ధూళిపాళ , ప్రకాష్ రాజ్ ,మురళీశర్మ , రేవతి ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.

తక్కువ రేటుకే 'మేజర్' టికెట్లు
పెద్ద పెద్ద సినిమాలకు ఈమధ్య టికెట్ రేట్లు పెంచుకుంటున్న సంగతి తెలిసిందే కదా. చిన్న సినిమాలు అయితే మాములు రేట్లకే టికెట్లను అమ్ముతున్నా.. పెద్ద సినిమాలు కాబట్టి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండటంతో నిర్మాతలు టికెట్ రేట్లు పెంచుకుంటున్నారు. ఇక ఇప్పుడు మేజర్ మేకర్స్ కూడా సినిమా టికెట్లపై అప్ డేట్ ఇచ్చారు. ఈసందర్భంగా చిత్రయూనిట్ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా పాండమిక్ తర్వాత అతి తక్కువ రేట్లతో ఈసినిమా వేస్తున్నాము. తెలంగాణలో సాధారణంగా మల్టీప్లెక్స్‌లలో రూ.295, సింగిల్ స్క్రీన్‌లలో రూ. 175 ఉండేవి. కానీ మేజర్ చిత్రానికి రూ.100 తగ్గించి మల్టీప్లెక్స్‌లలో రూ.195, సింగిల్ స్క్రీన్‌లలో…

మారిన 'మేజర్' రిలీజ్ డేట్..!
శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా మేజర్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 26/11 దాడుల్లో ఆయన చూపించిన తెగువ, ధైర్య సాహసాలు మాత్రమే కాకుండా ఆయన జీవితంలోని ప్రతీ ఒక్క ఘటనను చూపించబోతోన్నారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మరోవైపు అడివి శేష్ అప్పుడప్పుడు ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నాడు.