
ట్యాగ్ · 5 కథనాలు


'మాచర్ల నియోజకవర్గం' నుండి నితిన్ దమ్కీ..!

"మాచర్ల నియోజకవర్గం" లో మరో కథానాయికగా కేథరిన్?

'మాచర్ల నియోజకవర్గం' మాస్ సాంగ్ ఖాతాలో '500M' వ్యూస్..!
గత ఏడాది పలు సినిమాలతో అలరించిన నితిన్ ఈ ఏడాది కూడా మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేశాడు. ఎమ్.ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతూ నితిన్ హీరోగా వస్తున్న సినిమా మాచర్ల నియోజకవర్గం. మొదటి సారిగా నితిన్ పూర్తి స్థాయి భిన్నమైన పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు మేకర్స్. ఈ క్రమంలో మేకర్స్ వరుసగా అప్‌డేట్‌లను ప్రకటిస్తూ ప్రేక్షకులలో క్యూరియాసిటిని పెంచుతున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్…

'మాచర్ల నియోజకవర్గం' నుండి నితిన్ దమ్కీ..!
హిట్లు ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నితిన్. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో సిద్దార్ధ రెడ్డి అనే ఐఏఎస్ అధికారిగా పాత్రలో నితిన్ కనిపించనున్నాడు. ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్స్ ఇస్తూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాడు నితిన్. ఇటీవల విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక 'రారా రెడ్డి' అనే సాంగ్ అయితే అధిక వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.

కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'మాచర్ల నియోజకవర్గం'
ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’. ఈసినిమాతోనే రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ప్రస్తుతం ఈ చిత్రంలోని పాటలని ఇటలీ, ఆస్ట్రియాలోని అందమైన ప్రదేశాలలో చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే నితిన్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ , టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. పోస్టర్, టీజర్ వీడియోలో నితిన్ మునుపెన్నడూ లేని విధంగా డిఫరెంట్ యాక్షన్ లుక్ తో ఆకట్టుకున్నాడు.

"మాచర్ల నియోజకవర్గం" లో మరో కథానాయికగా కేథరిన్?
శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్,బ్లాక్ బస్టర్ "ఉప్పెన"మూవీ ఫేమ్ కృతిశెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ “మాచర్ల నియోజకవర్గం” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీ లో విలన్ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణ గా ఉండనుందనీ , విలన్ గా సముద్ర ఖని నటించనున్నారనీ సమాచారం. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు.

"మాచర్ల నియోజక వర్గం "లో సముద్ర ఖని ద్విపాత్రాభినయం ?
పలు తమిళ సూపర్ హిట్ మూవీస్ లో నటించిన సముద్రఖని, పలు తమిళ సూపర్ హిట్ మూవీస్ ను తెరకెక్కించారు. “నాలో “, శంభో శివశంభో “, “జెండాపై కపిరాజు “మూవీస్ తో సముద్రఖని దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. “అల .. వైకుంఠపురము లో ..”,”క్రాక్” మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సముద్రఖని టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారారు. పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న సముద్రఖని ప్రస్తుతం “రౌద్రం రణం రుధిరం “, సర్కారు వారి పాట” తెలుగు మూవీస్ తో పాటు 6 తమిళ , ఒక మలయాళ మూవీ లో నటిస్తున్నారు. సముద్ర ఖని విలన్ గా పలు టాలీవుడ్ మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.