
ట్యాగ్ · 8 కథనాలు


లక్కీ భాస్కర్ 11 డేస్ కలెక్షన్స్

వన్ మిలియన్ క్లబ్ లోకి లక్కీ భాస్కర్

లక్కీ భాస్కర్ 6డేస్ కలెక్షన్స్

లక్కీ భాస్కర్ 4 డేస్ కలెక్షన్స్

100 కోట్ల క్లబ్ లోకి లక్కీ భాస్కర్
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కి తెలుగు సినిమా బాగా కలిసొచ్చినట్టే కనిపిస్తుంది. అపజయం అన్నదే లేకుండా హ్యాట్రిక్ హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. తొలి సినిమా 'మహానటి', ఆ తరువాత 'సీతారామం' రెండూ ఒకదానిని మించి మరొకటి సూపర్ హిట్ అయ్యాయి. ఇక మధ్యలో గెస్ట్ పాత్రలో మెరిసిన 'కల్కి 2898 AD' కూడా బ్లాక్ బస్టరే.

లక్కీ భాస్కర్ 11 డేస్ కలెక్షన్స్
బాక్సాఫీస్ వద్ద లక్కీ భాస్కర్ హవా కొనసాగుతుంది.రెండో వారం లోకి ఎంట్రీ ఇచ్చి ఏ మాత్రం స్లో అవ్వకుండా సాలిడ్ వసూళ్లను రాబడుతూ 100 కోట్లకు చేరువైంది.11 రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాపంగా 96.7కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది మేకర్స్ ప్రకటించారు. ఈరోజుతో 100కోట్ల మార్క్ ను చేరుకోనుంది.ఒక్క తెలుగులోనే కాదు తమిళ, మలయాళంలో సూపర్ రన్ ను కొనసాగిస్తుంది. ఈసినిమాతో దుల్కర్ సల్మాన్ కు 100 కోట్ల క్లబ్ లో చేరనున్నాడు.అంతేకాదు లక్కీ భాస్కర్ తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలువనుంది.అయితే ఈవారం సూర్య కంగువా థియేటర్లలోకి వస్తుండడడం తో లక్కీ భాస్కర్ గట్టి పోటీ ఎదురుకానుంది.

వన్ మిలియన్ క్లబ్ లోకి లక్కీ భాస్కర్
దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సెకండ్ వీక్ లో కూడా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.అందులో భాగంగా నిన్నటి తో ఈసినిమా యూఎస్ఏలో 1మిలియన్ డాలర్ మార్క్ ను చేరుకుంది.ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కూడా కావడంతో బ్లాక్ బాస్టర్ దిశగా సాగుతుంది.ఫుల్ రన్ లో 1.5 మిలియన్ క్లబ్ లో చేరనుంది.తెలుగు రాష్ట్రాల్లోనూ ఈసినిమా సూపర్ వసూళ్లను దక్కించుకుంటుంది.ఈరోజు బుకింగ్స్ సాలిడ్ గా వున్నాయి.

లక్కీ భాస్కర్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్
దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ నిన్నటి తో మొదటి వారం రన్ పూర్తి చేసుకుంది.ఇక ఈ ఫస్ట్ వీక్ లో స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగిస్తూ ప్రపంచ వ్యాప్తంగా 71.2కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి మంచి లాభాలను తీసుకొస్తుంది.తమిళనాడులో ఈ సినిమాకు థియేటర్లను కూడా పెంచారు.ఈరోజు నుండి దాదాపు 1000కి పైగా స్క్రీన్ లలో ప్రదర్శించబడుతుంది.తెలుగు రాష్ట్రాల్లో మిగితా సినిమాలతో పోటీ వున్నా సాలిడ్ వసూళ్లను సొంతం చేసుకుంటుంది.అటు నార్త్ అమెరికాలో 900k డాలర్లను రాబట్టింది.ఈరోజుతో 1 మిలియన్ మార్క్ ను చేరుకోనుంది.ఓవరాల్ గా ఈసినిమా సూపర్ హిట్ నుండి బ్లాక్ బాస్టర్ దిశగా…

లక్కీ భాస్కర్ 6డేస్ కలెక్షన్స్
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ వీక్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ రన్ ను కొనసాగిస్తోంది.దాంతో 6రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 67.6కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది.తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని ప్రాఫిట్ లోకి ఎంటర్ అయ్యింది. తమిళనాడు లో కూడా నిన్నటి తో టార్గెట్ ను రీచ్ అయ్యింది.కేరళ లో కూడా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది. అటు ఓవర్సీస్ లో 1మిలియన్ డాలర్ మార్క్ కు చేరువలో వుంది.

లక్కీ భాస్కర్ 4 డేస్ కలెక్షన్స్
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా లక్కీ భాస్కర్ ఎక్స్ లెంట్ రన్ ను కొనసాగిస్తోంది.నిన్నటితో ఈసినిమా కోట్ల 50 క్లబ్ లో చేరింది.లక్కీ భాస్కర్ ప్రపంచ వ్యాప్తంగా 4రోజుల్లో 55.4 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని మేకర్స్ ప్రకటించింది.ఈరోజు తో బ్రేక్ ఈవెన్ కూడా పూర్తి కానుంది.తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కేరళ ,తమిళనాడులో కూడా లక్కీ భాస్కర్ సత్తాచాటుతుంది.ఫుల్ రన్ లో 100కోట్ల మార్క్ ను టచ్ చేయనుంది.అటు నార్త్ అమెరికా లో 700k డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది.రేపటి తో 1మిలియన్ ను చేరుకోనుంది.ఈకూడా బుకింగ్స్ బాగానే వున్నాయి.

లక్కీ భాస్కర్ సెకండ్ డే సెన్సేషనల్ హోల్డ్
తెలుగు రాష్ట్రాల్లో లక్కీ భాస్కర్ హవా కొనసాగుతుంది.మౌత్ టాక్ సూపర్ గా ఉండడంతో మొదటి రోజు ఎంత రాబట్టిందో రెండో రోజు కూడా ఆ రేంజ్ వసూళ్లను సొంతం చేసుకొని సెన్సేషనల్ హోల్డ్ కొనసాగించింది.రెండు రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 26.2కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఈరోజు, రేపు కూడా ఇదే ఫ్లో ను కొనసాగించనుంది.దాంతో ఈ వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేయనుంది.కంగువా వచ్చే వరకు పెద్ద సినిమాలు ఏవి లేకపోవడం తో ఫుల్ రన్ లో ,లక్కీ భాస్కర్ 50కోట్ల మార్క్ ను ఈజీగా క్రాస్ చేయనుంది.

లక్కీ భాస్కర్ కు ఫస్ట్ డే సెన్సేషనల్ కలెక్షన్స్
సీతారామం తరువాత మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో హీరోగా నటించిన రెండో సినిమా లక్కీ భాస్కర్. ట్రైలర్ రిలీజ్ వరకు పెద్దగా బజ్ లేదు కానీ ట్రైలర్ వచ్చాకా పరిస్థితి మారిపోయింది.సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది.రిలీజ్ కు ముందే పెయిడ్ ప్రీమియర్లు వేయడం కూడా అడ్వాంటేజ్ అయ్యింది. నిన్న విడుదలైన ఈసినిమా మొదటి రోజు యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్ ,టాక్ తో సెన్సేషనల్ వసూళ్లను దక్కించుకకుంది.ప్రీమియర్లు తో కలుపుకొని ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు 12.7కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఒక్క తెలుగులోనే కాదు మలయాళ ,కన్నడ ,తమిళం లో కూడా సూపర్ రివ్యూస్ సొంతం చేసుకోవడంతో సాలిడ్ వసూళ్లను…