కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Lucifer Telugu Remake

ట్యాగ్ · 25 కథనాలు · పేజీ 2

సినిమా వార్తలు

"లూసిఫర్"రీమేక్ లో నయనతార ?

సూపర్ స్టార్ మోహన్ లాల్ , మంజు వారియర్ ప్రధానపాత్రలలో, పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ థ్రిల్లర్ “లూసిఫర్” మలయాళ మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో మంజు వారియర్ ఒక గ్రేట్ పొలిటీషియన్ కుమార్తె గా , బాధ్యత గల మహిళగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు.ఆమె కు సపోర్ట్ గా నిలిచిన మోహన్ లాల్ తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ “లూసిఫర్” మలయాళ మూవీ తెలుగు రీమేక్ మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనుంది. మలయాళ మూవీ లో నటించిన మంజు వారియర్ పాత్రకు నయనతార ను సెలెక్ట్ చేసినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

‘లూసీఫర్’ రీమేక్‌ ‌కు ముహూర్తం ఖరారు..?

మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ విషయంలో మాత్రం కొంత కన్ఫ్యూజన్ నెలకొన్నా ఇటీవలే ఈ రీమేక్ డైరెక్టర్ విషయంలో క్లారిటీ వచ్చింది. త‌మిళ ఇండ‌స్ట్రీలో రీమేక్ స్పెష‌లిస్టుగా పేరుగాంచిన మోహ‌న్ రాజా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'లూసిఫర్' రీమేక్ కు డైరెక్టర్ ఫిక్స్

మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ విషయంలో మాత్రం ఇప్పటివరకూ క్లారిటీ రాలేదు. మొదట వినాయక్ అన్నారు. ఆ తర్వాత వినాయక్ తప్పుకున్నాడని.. ఆ తర్వాత రీమేక్ భాద్యతలు సాహో డైరెక్టర్ సుజీత్ కు అప్పచెప్పినట్టు.. సుజీత్ కూడా కథ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాడని అన్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ సుజీత్ కూడా ఈ సినిమా నుండి తప్పుకున్నట్టు ఈమధ్య వార్తలు వినిపించాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చిరు క్లారిటీ.. అందుకే సుజీత్ ప్లేస్ లో వినాయక్

ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్యలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టాలని.. ముందు రామ్ చరణ్ తో వున్న సీన్స్ పూర్తి చేయాలనీ భావిస్తోందట చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. తనయుడు రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Megastar Chiranjeevi Join Hands With VVVinayak For Lucifer Telugu Remake
సినిమా వార్తలు

చిరు 'లూసిఫర్' బాధ్యత వినాయక్ కు..!

పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ కథానాయకుడిగా మలయాళంలో గత ఏడాది మార్చిలో వచ్చిన 'లూసిఫర్' ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా రైట్స్ రామ్ చరణ్ సొంతం చేసుకొని.. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై చిరు ప్రధాన పాత్రలో చరణ్ ఈ సినిమాను నిర్మించనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే హక్కులు సొంతం చేసుకున్నాడు కానీ అప్పటినుండీ.. ఈ సినిమా డైరెక్టర్, హీరో విషయంలో మాత్రం చరణ్ ఓ నిర్ణయానికి రాలేకపోయాడు. ఇక ఇన్ని రోజులు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాలేదు.

TFN Adminవాట్సాప్

షేర్