
ట్యాగ్ · 4 కథనాలు


"లవ్ స్టోరీ " ని "ప్రేమ్ నగర్" తో పోల్చిన కింగ్

'లవ్ స్టోరీ' ట్రైలర్ రిలీజ్
"లవ్ స్టోరీ " టీజర్ రిలీజ్

'లవ్ స్టోరీ' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా 'లవ్ స్టోరీ'. ఇక ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దానికితోడు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లు సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచగా దానికితోడు మహేష్ బాబు లాంటి హీరోలు సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నా అని చెప్పడంతో మరింత క్రేజ్ పెరిగింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా రేపు రిలీజ్ కానుంది. మరి ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం..

"లవ్ స్టోరీ " ని "ప్రేమ్ నగర్" తో పోల్చిన కింగ్
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఆహ్లాద భరిత ప్రేమ కథా చిత్రం “లవ్ స్టోరీ” సెప్టెంబర్ 24 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. “లవ్ స్టోరీ “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ , సాంగ్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా “లవ్ స్టోరీ ” మూవీ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

'లవ్ స్టోరీ' ట్రైలర్ రిలీజ్
నాగచైతన్య, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం లవ్ స్టోరీ. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ కానీ మరీ ముఖ్యంగా సారంగదరియా పాట కానీ ఎంత రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయో చూశాం. దీంతో ఈసినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. అందుకే అభిమానులు కూడా సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈసినిమా రిలీజ్ ఎన్నిసార్లు వాయిదా పడిందో తెలిసిందే కదా. మొదట ఈ ఏడాది ఏప్రిల్ లో అనుకున్నారు కానీ రిలీజ్ అవ్వలేదు.. ఆ తరువాత కొన్ని రోజులు ఓటీటీ లో రిలీజ్ అవుతుందని కన్ఫ్యూజన్లో పెట్టారు. ఫైనల్ గా ఇటీవలే రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. మొదట వినాయక చవితికి వస్తుందని…
"లవ్ స్టోరీ " టీజర్ రిలీజ్
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగో క్రియేషన్స్ బ్యానర్స్ పై ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ" రూపొందుతున్న విషయం తెలిసిందే. దేవయాని , రావు రమేష్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సిహెచ్ పవన్ సంగీతం అందించారు. హీరో నాగచైతన్య , సాయి పల్లవి ఫస్ట్ కాంబినేషన్ , దర్శకుడు శేఖర్ కమ్ముల , సాయి పల్లవి సెకండ్ కాంబినేషన్ లో రూపొందుతున్న "లవ్ స్టోరీ " మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.